Accident: కాలువలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు భవన నిర్మాణ కూలీల బతుకు ఛిద్రం

కూలీలలో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, ఇంకా..

Accident: కాలువలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు భవన నిర్మాణ కూలీల బతుకు ఛిద్రం
Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2022 | 1:05 PM

కర్నాటకలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలలో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మందికి తీవ్ర గాయాలయినట్టుగా తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకాక్‌ తాలూకలోని అక్కాతంగియార హలా గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు బెలగావికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బెలగావిలోని కనబరగి గ్రామం వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బళ్లారి నాలాలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో వాహనంలో చిక్కుకుపోయిన వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బెలగావి పోలీస్‌ కమిషనర్‌ ఎంబీ బోర లింగయ్య ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు కర్నాటక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి ముగ్గురి పరిస్థితి విషమంగా అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్