ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్వాకం.. రూ. 3.50లక్షలతో ఆపరేషన్‌ చేసి.. కుట్లు వేయటం మరిచారు..

ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎవరో ఒకరు ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు. తాజాగా మరో ప్రైవేటు దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది.

ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్వాకం.. రూ. 3.50లక్షలతో ఆపరేషన్‌ చేసి.. కుట్లు వేయటం మరిచారు..
Doctors
Jyothi Gadda

|

Jun 26, 2022 | 11:58 AM

కాసుల వేటలో పడ్డ ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల ప్రాణాలతో చెలాగాటం ఆడుతున్నాయి. చిన్ని ఆపరేషన్లకే వేలు, లక్షలు వసూలు చేసే ప్రైవేటు డాక్టర్లు మనిషి ప్రాణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎవరో ఒకరు ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు. తాజాగా మరో ప్రైవేటు దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. వృద్ధ మహిళకు డాక్టర్‌ ఆపరేషన్‌ చేసి, కుట్లు వేయకుండా మరిచిపోయారు. ఈ దారుణ సంఘటన దావణగెరెలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దావణగెరె తాలూకా బుల్లాపురకు చెందిన అన్నపూర్ణమ్మను 65) కడుపునొప్పితో ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు..జూన్‌ 9న ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు అన్ని పరీక్షలు చేసి జూన్‌ 13న ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ బిల్లు రూ. 3.50లక్షలు చెల్లించినట్టుగా అన్నపూర్ణమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ, ఆమెకు సర్జరీ చేసిన వైద్యులు కోత కోసిన చోటకుట్లు వేయకుండా వదిలేశారని వాపోయారు. ఆమె నొప్పితో బాధపడుతుండడంతో కొడుకు గమనించి వైద్యులను ప్రశ్నించగా ఏదో సాకు చెప్పి తప్పించుకున్నారు. ఆపరేషన్‌ చేసి 15 రోజులు అవుతుంది. ఇంతవరకూ గాయం మానలేదని బాధితులు తెలిపారు. డాక్టర్లు అడిగినంత ఫీజులు చెల్లించామని చెప్పారు. చివరకు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

అన్నపూర్ణమ్మ ప్రస్తుతం దావణగెరె ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అన్నపూర్ణమ్మకు ఆపరేషన్‌ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేటు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు బసవనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu