UP CM Yogi: యూపీ సీఎం యోగికి తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
UP CM Yogi: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పక్షిని ఢీకొట్టడంతో..
UP CM Yogi: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పక్షిని ఢీకొట్టడంతో.. అలజడి రేగింది. దాంతో అలర్ట్ అయిన ఫైలట్.. డీజీసీఏ అధికారుల ఆదేశాలతో వారణాసిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ముఖ్యమంత్రి యోగి.. వారణాసి నుంచి లక్నో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఎలాంటి అపాయం చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటి తరువాత సీఎం యోగి వారణాసి నుంచి లక్నో బయలుదేరారు.