Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: ‘మంత్రి’ డెవలపర్స్‌ రియల్ ఎస్టేట్ కంపెనీ సీఈఓ సుశీల్‌ అరెస్టు.. వేల కోట్లు స్వాహా!

బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ కంపెనీ.. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్ సుశీల్ పి మంత్రి శనివారం (జూన్‌ 25న) అరెస్టయ్యాడు. మనీలాండరింగ్ కేసులో..

Bengaluru: 'మంత్రి' డెవలపర్స్‌ రియల్ ఎస్టేట్ కంపెనీ సీఈఓ సుశీల్‌ అరెస్టు.. వేల కోట్లు స్వాహా!
Mantri Developers Ceo
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2022 | 11:56 AM

ED arrests Mantri Developers head: బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ కంపెనీ.. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్ సుశీల్ పి మంత్రి శనివారం (జూన్‌ 25న) అరెస్టయ్యాడు. మనీలాండరింగ్ కేసులో సుశీల్ పి మంత్రిని అరెస్టు చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ED) అధికారులు మీడియాకు తెలిపారు. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన డైరెక్టర్‌, ఉద్యోగులపై 2020లో బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు కంపెనీ డైరెక్టర్‌ను 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. ఫ్లాట్స్‌ అమ్ముతామంటూ గృహ కొనుగోలుదారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసిన డబ్బును, కంపెనీ యాజమన్యం మోసపూరింతంగా ఇతర మార్గాలకు మళ్లించినట్టు ఈడీ దర్యాప్తు (మార్చి 22)లో తేలింది. దీంతో ఆ ప్రాజెక్ట్‌ నిలిచిపోయింది.

ఒకే ప్రాజక్టుపై మంత్రి గ్రూప్ కంపెనీ వివిధ ఫైనాన్స్‌ సంస్థల నుంచి రూ. 5,000 కోట్ల రుణం తీసుకుంది. వీటిపై గడువు ముగియడంతో రూ. 1,000 కోట్ల మేర బకాయి పడ్డట్లు ఈడీ వెల్లడించింది. అంతేకాకుండా ఫ్లాట్ల కొనుగోలు పేర గృహకొనుగోలుదారుల నుంచి రూ.1000 కోట్లను అడ్వాన్స్‌గా డబ్బు వసూలుసింది. డబ్బు చెల్లించి 7 నుంచి 10 ఏళ్లు గడుస్తున్న ఇంత వరకు కొనుగోలు దారులకు ఫ్లాట్స్‌ అందజేయలేదు. కొంతమందికి డబ్బు తిరిగి రిఫండ్‌ కూడా చేయలేదని ఈడీ దర్యాప్తులో బయటపడింది.

మనీలాండరింగ్‌లో పలువురికి భాగస్వామ్యం ఉన్నట్లు, తప్పుడు పత్రాలు, బ్రోచర్లతో తమను మోసం చేసి ప్రలోభపెట్టి, దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు కొనుగోలుదార్లు పోలీసులతోపాటు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ ఆస్తులను తాకట్టు పెట్టి వివిధ ఫైనాన్స్‌ సంస్థల నుంచి రుణాలు సేకరించింది. ఈ విషయమై ప్రశ్నించడానికి ఈడీ జూన్‌ 24న కంపెనీ డైరెక్టర్‌ను పిలిపించింది. ఐతే వారి ప్రశ్నలకు డైరెక్టర్‌ సరైన సమాధానాలు ఇవ్వలేదని, దర్యాప్తుకు సహకరించడంలేదని, ఈడీ అడిగిన సంబంధిత పత్రాలను కూడా సమర్పించలేదని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇతర తాజా వార్తల కోసం క్లిక్ చేయండి.