Covid 4th wave: స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు! ఆగని మృతుల సంఖ్య..

గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఐతే గడచిన 24 గంటల్లో స్వల్పంగా కొత్తకేసులు నమోదయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు (జూన్‌ 26)న వెల్లడించింది. దేశ వ్యాప్తంగా శనివారం రోజు మొత్తంలో 11,739 పాజిటివ్‌ కేసులు కొత్తగా..

Covid 4th wave: స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు! ఆగని మృతుల సంఖ్య..
Covid In India
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2022 | 9:56 AM

June 26 Coronavirus Highlights: గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఐతే గడచిన 24 గంటల్లో స్వల్పంగా కొత్తకేసులు నమోదయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు (జూన్‌ 26)న వెల్లడించింది. దేశ వ్యాప్తంగా శనివారం రోజు మొత్తంలో 11,739 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యినట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు తెల్పుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో దాదాపు 15,940 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా శనివారం నాటికి కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇక గడచిన 24 గంటల్లో 25 మంది కరోనాతో మృతి చెందినట్లు గణాంకాలు తెల్పుతున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్య 5,24,999కు చేరుకుంది. నిన్న ఒక్కరోజులోనే 10,917ల మంది కరోనా నుంచి కోలుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 92,576ల యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ పేర్కొంది.

మరిన్ని తాజా అప్‌డేట్ల కోసం క్లిక్‌ చేయండి.