Covid 4th Wave: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విలయం.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా కేసుల సంఖ్య 17 వేలకు పైగా నమోదైంది. నిన్న దేశవ్యాప్తంగా 17,073 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 21 మంది మరణించారు.
India Covid-19 Updates: దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో (ఆదివారం) కరోనా కేసుల సంఖ్య 17 వేలకు పైగా నమోదైంది. నిన్న దేశవ్యాప్తంగా 17,073 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 21 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 94,420 (0.22 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 4.39 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.57 శాతం ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. శనివారంతో పోల్చుకుంటే.. 45 శాతం కేసులు పెరిగాయి.
దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..
- దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,07,046 కి పెరిగింది.
- కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,020 కి చేరింది.
- నిన్న కరోనా నుంచి 15,208 మంది బాధితులు కోలుకున్నారు.
- వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,27,87,606కి చేరింది.
- దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 197,11 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
- నిన్న 2,49,646 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
- దేశవ్యాప్తంగా నిన్న 3,03,604 మందికి కరోనా పరీక్షలు చేశారు.
India reports 17,073 fresh COVID19 cases & 21 deaths today; Active caseload at 94,420 pic.twitter.com/NBcPK0kcl7
— ANI (@ANI) June 27, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..