Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Gain: సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా..? వీటిని తినండి బరువు ఇట్టే పెరుగుతారు..

అలాంటి వారు కండరాలను పెంచుకోవడానికి, బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతారు. అయినప్పటికీ బరువు పెరగదు. అయితే.. బరువు పెరగడం, కండరాలను పొందడం చాలా కష్టం అంటున్నారు వైద్య నిపుణులు.

Weight Gain: సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా..? వీటిని తినండి బరువు ఇట్టే పెరుగుతారు..
Weight Gain Diet
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 27, 2022 | 9:20 AM

Weight Gain Diet: ప్రస్తుత కాలంలో చాలా మంది స్థూలకాయంతో సతమతం అవతుంటే.. మరికొంతమంది సన్నబడటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు లేదా తక్కువ బరువు రెండూ సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి మీరు సమతుల్య బరువును కలిగి ఉండటం చాలా ముఖ్యం. సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి నిత్యం చాలా కష్టపడతారు. అలాంటి వారు కండరాలను పెంచుకోవడానికి, బరువు పెరగడానికి ఏవేవో డైట్లు ఫాలో అవుతారు. అయినప్పటికీ బరువు పెరగదు. అయితే.. బరువు పెరగడం, కండరాలను పొందడం చాలా కష్టం అంటున్నారు వైద్య నిపుణులు. అలాంటి వారు బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతుంటే ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. వంటగదిలో ఉండే బంగాళదుంపలు, పెరుగు బరువు పెరగాలనుకున్న వారికి చాలా సహాయం చేస్తాయి. శాకాహారులు బరువు పెరగడానికి ఇది మంచి ఎంపిక. బంగాళాదుంప, పెరుగు మీ బరువును పెంచడంలో ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగాళదుంప, పెరుగు బరువును ఎలా పెంచుతాయి

కార్బోహైడ్రేట్ల మొత్తాన్ని పెంచడం వల్ల కొవ్వు పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అలా అస్సలు కాదు. కార్బోహైడ్రేట్లు మాత్రమే తినడం ద్వారా బరువు పెరుగుతారనే విషయం ఎంత నిజమో.. పిండి పదార్థాలు తినడం ద్వారా కూడా బరువు పెరుగుతారన్నది అంతే నిజం.. డైట్లో మీరు ఏం తింటున్నారో వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం.

ఇవి కూడా చదవండి

బంగాళదుంపలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బంగాళాదుంప దుంప కూరల్లో మంచిది. బంగాళదుంపలో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. బంగాళాదుంప బరువు పెరగడానికి సహాయపడుతుంది. బరువు పెరగడానికి ఒక మీడియం సైజు బంగాళాదుంపను తింటే.. అప్పుడు శరీరానికి 150 నుంచి 160 కేలరీలు అందుతాయి. వాటిలో 37 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. బంగాళాదుంప కండరాలను పెంచడంలో సహాయపడుతుంది.

పెరుగు బరువును ఎలా పెంచుతుంది..

పెరుగు బరువు పెరగడానికి, తగ్గడానికి రెండింటికీ సహాయపడుతుంది. ఫుల్ క్రీమ్ పాలతో చేసిన పెరుగు తింటే, అది బరువు పెరగడానికి సహాయపడుతుంది. 100 గ్రాముల ఫుల్ క్రీమ్ పాలు పెరుగులో 20 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 6 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది కండరాలను పెంచడంలో సహాయపడుతుంది. రోజూ 150 నుంచి 200 గ్రాముల పెరుగును అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో తీసుకుంటే శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది. ఈ విధంగా పెరుగు బరువు పెరగడానికి దారితీస్తుంది.

బరువు పెరగడానికి , పెరుగు, బంగాళాదుంపలను ఈ విధంగా తినాలి. దీంతో బరువు పెరగవచ్చు. అల్పాహారంలో పెరుగు, బంగాళాదుంపలను తినవచ్చు. ఉడించిన బంగాళదుంపల్లో కొంచెం పంచదార కలిపి తినవచ్చు. ఇంకా బంగాళదుంపలు, పెరుగు కలిపి తినవచ్చు. దీంతోపాటు బంగాళదుంపలతో చాట్, ఆలూ రైతా లాగా చేసుకోని తినవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..