Pet Dogs: పెంపుడు కుక్కలకు ప్రత్యేక పార్కు, బ్యూటీ పార్లర్లు, బర్త్ డే పార్టీలు.. అట్లుంటది మరి పెట్ డాగ్స్ రిచ్ లైఫ్..

Pet Dogs Life-Style: కుక్కలను పెంచుకునే వాళ్లు.. డాగ్ లవర్స్.. ఈ పరిధి దాటి ఇప్పుడు పెట్ పేరెంట్స్ గా చెప్పే స్ధాయికి చేరింది. అందుకే డాగ్స్ కేర్ కోసం కాదు..డాగ్స్ కాస్మటాలజీకోసం వేల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.

Pet Dogs: పెంపుడు కుక్కలకు ప్రత్యేక పార్కు, బ్యూటీ పార్లర్లు, బర్త్ డే పార్టీలు.. అట్లుంటది మరి పెట్ డాగ్స్ రిచ్ లైఫ్..
Pet Dog
Follow us
Ganesh Y - Input Team

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 27, 2022 | 7:04 PM

Pet Dogs Life-Style: ఏం బతుకురా నీది… కుక్క బతుకు అని చాలా తెలిగ్గా మాట్లాడతాం. కానీ ఇక్కడ డాగ్స్  బ్యూటీ పార్లర్లకు వెళతాయి. వీకెండ్స్ లో తమకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కుల్లో షికార్లు చేస్తాయి. ఏటా పుట్టిన రోజులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాయి. తోటి కుక్కలతో కలసి పార్టీలు చేసుకుంటాయి. ఇదేం వింత అని.. ఆశ్చర్యపోతున్నారా? కాస్మో పాలిటన్ సిటీలో పెట్ డాగ్స్ లైఫ్‌ స్టైల్ కొత్త లోకంలా కనిపిస్తోంది. పెట్ డాగ్స్ రిచ్ లైఫ్‌ చూస్తే… వావ్‌ అనాల్సిందే.

డాగ్స్… ఈ పేరు విశ్వానికి మారుపేరు. అందుకే పెంపుడు జంతువుల్లో డాగ్ ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. అయితే…డాగ్స్ పెంపకం అంటే… గ్రామాల్లో తాము తిన్నదాన్లో కొంత వాటికి పెట్టడమే. కానీ పట్టణాల్లో ఇళ్లలో వాటికి ప్రత్యేకమైన ఫుడ్ పెట్టడం వాటిని ఆలనా పాలనా… కు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చూస్తాం. కానీ ఇప్పుడు కల్చర్ మారింది. డాగ్స్ కోసం వేలు కాదు.. లక్షలు ఖర్చుపెట్టే కల్చర్ గా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సాధారణ మనిషి లైఫ్‌ స్టైల్ కంటే డాగ్ లైఫ్‌ స్టైల్ ఖరీదుగా మారుతోంది.

చాలా నగరాల్లో పెట్ డాగ్స్ కు ప్రత్యేకమైన హాస్పటల్స్ ఉన్నాయి. వాటికి ఏలాంటి రోగాలు వచ్చినా ఆధునిక టెక్నాలజీ తో గుర్తించి మల్టీ స్పెషాలిటీ ట్రీమ్ మెంట్ ఇచ్చే.. హాస్పటల్స్ ఉన్నాయి. కుక్కలకు గాయలైతే.. ప్రత్యేక ఎక్స్ రే మిషన్లు.. స్కానింగ్ యంత్రాలు… బెడ్డెడ్ ఆసుపత్రులు.. ఎమర్జెన్సీ కేసులు చేసేందుకు ప్రత్యేక సిబ్బంది.. మోనటరింగ్ ఈసీజీ… ఇలా ఈ ఆసుపత్రులు చేస్తే ఆశ్యర్యపోతాం.

ఇవి కూడా చదవండి

డాగ్స్ మల్టిస్పెషాలిటీ ఆసుపత్రులు చూస్తేనే ఆశ్చర్యపోతే… డాగ్స్ పార్లర్లు.. గ్రూమింగ్ సెంటర్లు… బాత్ సెంటర్లు.. ఇలాంటి చూస్తే కళ్లు తెరిచి వావ్‌ అనాల్సిందే.  డాగ్స్ గ్రూమింగ్ పార్లర్‌లో డాగ్స్ కు స్నానాలు చేయిస్తారు. టబ్ బాత్ లు ఉంటాయి. వాటికి పెడిక్యూర్ లు చేస్తారు. హెయిర్ కటింగ్.. హెయిర్ డ్రెస్సింగ్… ఇలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.  వీటికి ఈ సేవలు అందించడానికి ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారు. డాగ్స్ ఈ సేవలు పొందే టప్పుడు వాటికి ఎలాంటి అసౌకర్యం లేకుండా పత్యేక ఎక్యూప్ మెంట్స్ వినియోగిస్తారు.

Cutest Dog Breeds

Cutest Dog Breeds

డాగ్స్ పార్లర్లు.. గ్రూమింగ్ సెంటర్లకు రాలేని మరింత ఖరీదైన డాగ్స్ కు వాటి భవనాలకే వెళ్లి ఈ సేవలు అందించే.. మొబైల్ వాహనాలు ఉన్నాయి. ఇందులో డాగ్స్ కు అన్ని సర్వీసులు అందించేందుకు అనుకూలంగా ఎక్యూప్ మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. కాస్మో పాలిటన్ సిటీల్లో డాగ్ కల్చర్ పెరగుతోంది. వాటికోసం వేలు కాదు లక్షల రూపాలయలు వెచ్చించే పెట్ పేరెంట్స్ ఉన్నారు. అందుకే ఇలాంటి సేవలు అన్నీ ఆధునిక టెక్నాలజీతో అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి కూడా ఇందుకోసం ఆధునిక పరికరాలుదిగుమతి చేసుకుంటున్నారు. ఈ డాగ్ సెంటర్లలో పనిచేయడానికి ప్రత్యేక ట్రైన్డ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామంటున్నారు డాగ్‌ డాక్టర్స్ గ్రూమింగ్ సెంటర్ సీఈవో చైత్ర.

పెరుగుతున్న డిమాండ్ తో అనేక సెంటర్లు వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 4 లక్షలకు పైగా పెట్ పేరెంట్స్ ఉన్నారనేది అంచనా. ఒక ఇండస్ట్రీగా భవిష్యత్ ఉండటంతో మరింత ఎక్కువ సెంటర్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందంటున్నారు ఈ సెంట్లు నడుపుతున్నవారు.

కుక్కలను పెంచుకునే వాళ్లు.. డాగ్ లవర్స్.. ఈ పరిధి దాటి ఇప్పుడు పెట్ పేరెంట్స్ గా చెప్పే స్ధాయికి చేరింది వ్యవహారం. అందుకే డాగ్స్ కేర్ కోసం కాదు..డాగ్స్ కాస్మటాలజీకోసం వేల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. కనీసం నెలకు ఒకటి కాదు రెండు సార్లైనా గ్రూమింగ్ సెంట్లకు తీసుకువస్తున్నారు. ఒక డాగ్ కు నెలకు.. 3500 నుంచి 8వేల వరకూ ఖర్చుచేస్తున్నారు పెట్ పేరెంట్.

ఎదుగుతున్న ఈ ఇండస్ట్రీకి.. ఇతర టెక్నాలజీ లో గ్రాడ్యుయేట్లు సైతం వస్తున్నారు. ఇంజనీరింగ్ చేసి… సాఫ్ట్ వేర్ లోనే హార్డ్ వేర్ లనో ఉండాల్సిన వారు .. అట్రాక్ట్అవుతున్నారు. డాగ్స్ పై లవ్ అండ్ అఫెక్షన్.. తో పాటు ఈ ఇండస్ట్రీ లో లైఫ్‌ ఉందనే ఉద్దశ్యంతోనే వస్తున్నామంటున్నారు ఈ బిజినెస్ లోనికి ఎంటర్ అవుతున్న వారు.

డాగ్‌ల కోసం ప్రత్యేక పార్క్ః

కేవలం… డాగ్ గ్రూమింగ్ పార్లర్లేనా అంటే.. అంతకు మించి హైదరాబాద్ లో కనిపిస్తోంది. హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా డాగ్ పార్క్ ను గ్రేటర్ మున్సిపాలిటీఏర్పాటు చేసింది. ఇక్కడకు డాగ్స్ వ్యాహ్యాలికి వస్తాయి. సాయంత్రాలు సరదాగా తోటి కుక్కలతో గడుపుతాయి. అదే వీకెండ్స్ అయితే… ఈ పార్క్ కిక్కిరిసి పోవాల్సిందే. పెట్ డాగ్స్ ను తీసుకువచ్చే కార్లతో ఈ పార్క్ ప్రాంతం ట్రాఫిక్ జాం అయిపోతుంది. డాగ్స్.. డాగ్ పేరెంట్స్ తో ఈ ప్రాంతం అంతా ఒక యాత్రా స్థలిలా కన్పిస్తుంది.

డాగ్స్ పార్క్ ఒక పెద్ద ప్రయోగం. ఇక్కడ డాగ్స్ కోసం అనేక యాక్టివిటీస్ ఏర్పాటుచేశారు. ఇక్కడకు ప్రతిరోజూ వందల సంఖ్యలో డాగ్స్ ను తీసుకుని వస్తారు. అదే వీకెండ్స్ అయితే ఈసంఖ్యకు రెండు మూడింతలు వస్తారంటున్నారు డాగ్ పార్క్ నిర్వాహకులు. 20 రూపాయలు టికెట్ తో డాగ్స్ అనుమతి. డాగ్సేకాదు… వీటినితీసుకువచ్చిన పెట్ పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నామని డాగ్స్ పార్క్ నిర్వాహకుడు డాక్టర్ మురళీధర్ తెలిపారు.

Dog Park in Hyderabad

Dog Park in Hyderabad

డాగ్స్ పార్క్ అంటే… తాము పెంచుకుంటున్నకుక్కలకు స్నేహితులను కలపడం.. వాటికి కూడా ఒక ఎంజాయ్ మెంట్ ఉంటుంది దాన్ని అందించడం అంటున్నారు డాగ్ లవర్స్. మరోవైపు డాగ్ లవర్స్ గా తాము కూడా చాలా ఆనందాన్ని పొందుతున్నామంటున్నారు. వివిధ పనుల్లో ఉండే వారికి ఒక మెంటల్ స్ట్రెస్ ను దూరం చేసే మార్గం అంటున్నారు డాగ్ లవర్. ఇక్కడితో ఆగడంలో లేదు.. డాగ్ లవ్. ఇదిగో ఇక్కడ చూడండి. హ్యపీ బర్త్ డే గ్రీటింగ్ బోర్డు. కేక్.. గెస్ట్ లు.. అవును ఇక్కడ డాగ్ బర్త్ డే జరుగుతోంది. కేక్ కట్ చేసి… మిగిలిన డాగ్ లవర్స్ డాగ్స్ తో పాటు ఆహ్వానించి పార్టీ చేస్తున్నారు. ఈపార్టీకి డాగ్స్ ఇష్టపడే గిప్ట్స్ కూడా తీసువస్తున్నారు గెస్ట్ లు. ఇవి చూస్తే… ఆశ్చర్యం కాదు ఒక కొత్త లోకం చూసినట్లే ఫీలవుతాం.

Pet Dogs3

Pet Dogs

ఇవిన్నీ కాకుండా డాగ్స్ కోసం ప్రత్యేక మైన ఫుడ్..రెస్టారెంట్లు.ఇదీ డాగ్స్ కొత్త బంగారు లోకం. కాస్మోపాలిటన్ సిటీస్ లో డాగ్స్ కల్చర్ కోట్ల రూపాయల వ్యాపారంగా..వెలకట్టలేనిఆహ్లాదంగా మారిపోతోంది.

(గణేష్‌.వై, టివి9 తెలుగు, హైదరాబాద్‌)