Health Benefits : సర్వ ఔషది చెంచలి కూర.. తింటే ఎన్ని లాభాలో.. 100 ఏళ్లు దాటినా సరే..

చెంచలి కూర, నీరు చెంచలి అని రెండు రకాలు ఉన్నాయి. సాధారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు. ఇది సర్వ ఔషది. చెంచలాకు ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా అస్సలు విడిచిపెట్టారు.

Health Benefits : సర్వ ఔషది చెంచలి కూర.. తింటే ఎన్ని లాభాలో.. 100 ఏళ్లు దాటినా సరే..
Chanchali
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2022 | 8:36 PM

Health Benefits :చెంచలాకు మంచి ఔషధ గుణాలు కల్గిన ఓ కలుపు మొక్క. పూర్వం ఏ కూరలు దొరకనప్పుడు ఈ చెంచలి కూర దొరికేది. ఈ ఆకు కూరను ఎక్కువగా ఉపయోగిస్తారు. చుక్రి కాంచం అనేది దీనికి సంస్కృత నామం. చెంచలి కూర, నీరు చెంచలి అని రెండు రకాలు ఉన్నాయి. సాధారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు. ఇది చలువ చేస్తుంది. మలాన్ని గట్టి పరుస్తుంది. త్రిదోషాలని పోగొడుతుంది. ఇది సర్వ ఔషది. చెంచలాకు ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా అస్సలు విడిచిపెట్టారు.

చెంచలాకులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీనిని ఔషధంగా వాడేవారు. ఈ మొక్కలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. అనేక రకాల రోగాలను నయం చేయడంలో చెంచలాకు బాగా ఉపకరిస్తుంది. చెంచలాకులో కాల్షియం అధికమోతాదులో ఉంటుంది. దీన్ని తినటం వల్ల ఎముకలు ధృఢంగా తయారవుతాయి. కంటి సమస్యలను దరి చేరకుండా ఉంచటంలో ఇందులో ఉండే విటమిన్ ఎ దోహదపడుతుంది. వాత, పిత్త, కఫ దోషాలను పొగొడుతుందని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేందుకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు.

జీర్ణ వ్యవస్ధ పనితీరును మెరుగుపరచటంతోపాటు మలబద్ధకాన్ని పోగొడుతుంది. బాలింతలో పాలు బాగా రావాలంటే.. ఈ చెట్టు వేర్ల కషాయాన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట.మొక్క ఆకుల కషాయాన్ని కొద్ది మోతాదులో తాగడం వల్ల మూత్ర పిండాలలో రాళ్లు కరిగిపోతాయట. ఆకులను పేస్ట్‌గా చేసి గాయాలపై, పుండ్లపై ఉంచడం వల్ల త్వరగా మానిపోతాయి. చిన్నపిల్లలకు ఈ ఆకు కూరను పప్పులో వేసి పెడితే ఎంతో మంచిది. ఎంతో ఇష్టంగా కూడా తింటారు. శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించటంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, రుతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేందుకు హెర్బల్ మెడిసిన్ గా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి