కన్న కొడుకునే కడతేర్చిన తల్లి.. సాయం చేసిన తోబుట్టువు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు!

ఈ భూమ్మీద స్వార్థం లేని ప్రేమ ఉందంటే అది కేవలం తల్లి ప్రేమమాత్రమే అని చెబుతారు. కానీ, ఏపీలో జరిగిన ఓ దారుణ ఘటన తల్లి ప్రేమకు విరుద్దంగా కనిపిస్తుంది.. కన్న కొడుకు అని కూడ చూడకుండా అమానుషంగా ప్రవర్తించింది.

కన్న కొడుకునే కడతేర్చిన తల్లి.. సాయం చేసిన తోబుట్టువు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు!
crime news
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2022 | 6:36 PM

నవమాసాలు మోసి బంగారంలా పెంచుకున్న కొడుకును కన్నతల్లే కడతేర్చింది. ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలన్నీ ఆస్తి పాస్తుల చుట్టే తిరుగుతున్నాయి. అలాంటి నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. క్షణికావేశంతో సొంతవారినే కడతేరుస్తున్నారు. పుత్ర ప్రేమ ప్రతి ఒక్కరికి ఉంటుంది.. కొడుకు ఎంతటి దుర్మార్గుడైనా ఆ తల్లి తనను ఆదరిస్తుంది. ఓడిలోకి చేర్చుకుంటుంది. ఈ భూమ్మీద స్వార్థం లేని ప్రేమ ఉందంటే అది కేవలం తల్లి ప్రేమమాత్రమే అని చెబుతారు. కానీ, ఏపీలో జరిగిన ఓ దారుణ ఘటన తల్లి ప్రేమకు విరుద్దంగా కనిపిస్తుంది.. కన్న కొడుకు అని కూడ చూడకుండా అమానుషంగా ప్రవర్తించింది. ఆస్తి కోసం కన్నకొడుకునే కర్కశంగా చంపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆస్థి అమ్మే విషయంలో తగదాలు చోటు చేసుకోవడంతో కన్న తల్లే సొంత కుమారుడిని హత్య చేయించింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు సమీపంలోని దిన్నెదేవరపాడులో జూన్‌14న అదే గ్రామానికి చెందిన మధవస్వామిని ఊరు చివర్లో ఉన్న పోలంలో గొంతు కొసి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో తేలిన విషయాలతో ఖాకీలే కంగుతిన్నారు. దర్యాప్తు వెల్లడైన షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయని కర్నూలు డిఎస్పీ మహేష్ తెలిపారు.

మృతుడికి పెద్దల ద్వారా వచ్చిన 60 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని అమ్మె విషయంలో మృతుడి తల్లి ఎల్లమ్మ, చెల్లెలు నిర్మలమ్మ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోంత కొడుకు ను హత్య చేసేందుకు పథకం పన్నారు. దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన లక్ష్మన్న అనే వ్యక్తి కి మధవస్వామిని హత్య చేస్తే మూడు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పడంతో ఈ హత్యకు పాల్పడ్డాడు లక్ష్మన్న. ఈ కేసులో తల్లి ఎల్లమ్మ, చెల్లెలు నిర్మలమ్మ తో పాటు హత్య చేసిన లక్ష్మన్న ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి