AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బల్లి ఖరీదు కొన్ని కోట్ల రూపాయలు.. ఒక్కటి దొరికితే చాలు! కానీ, దాన్ని పట్టడం.. అమ్మడం చట్టవిరుద్ధం

విలువైన వస్తువులు, మొక్కలతో పాటు జంతువులు, జంతు అవశేషాల అక్రమ రవాణా కూడా గుట్టుగా సాగిస్తుంటారు కొందరు స్మగ్లర్లు. ఇది చట్టపరంగా నేరం అయినప్పటికీ కొందరు అక్రమార్కుల కాసుల కక్కుర్తితో ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు.

ఈ బల్లి ఖరీదు కొన్ని కోట్ల రూపాయలు.. ఒక్కటి దొరికితే చాలు! కానీ, దాన్ని పట్టడం.. అమ్మడం చట్టవిరుద్ధం
Lizard
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2022 | 4:26 PM

Share

ఈ రోజుల్లో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్ని ప్రలోభాలు, తప్పని పరిస్థితుల్లో బలవంతంగానైనా అతను నేర కార్యకలాపాలకు దారితీసే పనులను కూడా చేస్తున్నాడు. స్మగ్లింగ్ గురించి మనందరికీ తెలుసు. విలువైన వస్తువులు, మొక్కలతో పాటు జంతువులు, జంతు అవశేషాల అక్రమ రవాణా కూడా గుట్టుగా సాగిస్తుంటారు కొందరు స్మగ్లర్లు. ఇది చట్టపరంగా నేరం అయినప్పటికీ కొందరు అక్రమార్కుల కాసుల కక్కుర్తితో ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో ఇలాంటి బ్లాక్ మార్కెట్ నడుస్తోంది. కొన్ని జంతువులు, వాటి అవయవాలు మిలియన్ల విలువైనవిగా ఉంటాయి. తాజాగా బీహార్‌లో వెలుగులోకి వచ్చిన ఒక బల్లి ఖరీదు తెలిస్తే మతిపోతుంది..ఎందుకంటే..ఆ బల్లి ఖరీదుతో మీరు ఏకంగా ఓ ఫెరారీ కారును కొనుగోలు చేయవచ్చు. ఈ బల్లి గురించి తెలుసుకుందాం.

ఈ అరుదైన బల్లిని గెక్కో లిజార్డ్స్ అంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ బల్లికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంతటి ధర చెల్లించి అయినా సరే కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు వ్యాపారులు. ఈ విలువైన బల్లి ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది భారతదేశంలోని బీహార్‌లోనూ అటు, నేపాల్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని కారణంగా ప్రజలు దీనిని బీహారీ బల్లి అని కూడా పిలుస్తారు.

ప్రపంచంలోని అంతర్జాతీయ మార్కెట్లలో ఈ బల్లి విలువ కోట్లలో ఉంటుంది. దీని మాంసం చాలా అనేక వ్యాధులను నయం చేస్తుంది. నపుంసకత్వం, మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల ఔషదాల్లో దీన్ని వినియోగిస్తారు. దీంతో మార్కెట్‌లో బీహారి బల్లికి డిమాండ్‌ కోట్లాది రూపాయలుగా ఉంది. చైనాలో దీనిని చైనీస్ సాంప్రదాయ ఔషధం చేయడానికి ఉపయోగిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు బీహారి బల్లి వేట కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో ఈ బల్లులను అమ్మడం లేదా కొనడం చట్టవిరుద్ధం. ఇది జికో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్ 3 ప్రకారం పేర్కొనబడింది. అయినప్పటికీ కూడా స్మగ్లర్లు వాటిని రహస్యంగా పట్టుకుని విదేశాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గెక్కో దాని పరిమాణాన్ని బట్టి డెబ్బై నుండి ఎనభై లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అదే అంతర్జాతీయ మార్కెట్‌లో అయితే, దాని విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు. స్మగ్లర్లు వాటిని పట్టుకుని చైనా వంటి దేశాల్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి ఒక్క బల్లి దొరికితే చాలు..కోటిశ్వరులు కావొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి