Amla Seeds: ఉసిరి గింజలతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఉఫ్‌ అని ఊసేయకండి..

ఉసిరికాయ తింటే రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఎంతగానో అడ్డుకుంటుంది. కేవలం ఉసిరి కాయ మాత్రమే కాదు అందులోని విత్తనాలు కూడా..

Amla Seeds: ఉసిరి గింజలతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఉఫ్‌ అని ఊసేయకండి..
Amla Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2022 | 2:01 PM

Health Benefits of Amla Seeds: ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇది మన అందరికీ బాగా తెలిసిన విషయమే..ఉసిరికాయలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి. ఉసిరికాయ తింటే రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఎంతగానో అడ్డుకుంటుంది. కేవలం ఉసిరి కాయ మాత్రమే కాదు అందులోని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.

ఇక ఉసిరి గింజలలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ ఇంకా అలాగే యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉన్నాయి. కంటిలో దురద, మంట ఇంకా అలాగే కళ్లలో ఎర్రబారడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఉసిరి గింజలను బాగా మెత్తగా నూరి కళ్లపైన ఇంకా అలాగే కింది భాగంలో రాసుకోవాలి. లేదంటే రెండు చుక్కల ఉసిరి రసాన్ని కంటిలో వేస్తే కంటి నొప్పి నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఉసిరి గింజలను ఎండబెట్టి దంచి బాగా పొడిచేసుకోవాలి. ఈ విత్తనాలు ఉసిరికాయతో సమానంగా శరీరానికి ప్రయోజనాలను చేకూర్చుతాయి.

ఈ పొడిని ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలను ఈజీగా తొలగిస్తుంది. ఈ పొడిలో కొద్దిగా తేనె కూడా కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.10 గ్రాముల ఉసిరి గింజలను ఎండలో ఎండబెట్టి ఇంకా వాటిని మెత్తగా పొడిగా చేసుకోవాలి. అలాగే అందులో 20 గ్రాముల చెక్కెర పొడిని కలిపి ఉంచుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ పొడిని కలిపి 15 రోజుల పాటు రోజూ తీసుకోవాలి. ఇలా చేస్తే నిద్రలేమి నుండి బయట పడవచ్చు.

ఇవి కూడా చదవండి

కొందరికి ముక్కు నుంచి కూడా రక్తస్రావం వస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇలాంటి సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఉసిరి గింజల పేస్ట్‌ని రాస్తే సరిపోతుంది. ఈ ఉసిరి గింజలకు కాస్త నీటిని కలిపి గ్రైండ్ చేసి బాగా పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను మీ నుదిటిపై అప్లై చేస్తే తలనొప్పి సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. మలబద్ధకం, అజీర్ణం లేదా ఆమ్లత్వంతో సమస్యలతో బాధపుతున్న వారు ఉసిరి గింజలతో తయారు చేసిన పొడిని గోరువెచ్చని నీళ్లలో వేసుకుని తాగొచ్చు. దీని వల్ల పై సమస్యల నుంచి ఉపనం పొందుతారు.

స్పైసీ ఫుడ్ లేదా మరేదైనా కారణం వల్ల ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఉసిరి గింజలతో చేసిన పొడిని తేనెతో కలిపి తింటే..ఎక్కిళ్ళ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలకు జామకాయ గింజలు, ఉసిరి గింజలను కొబ్బరి నూనెలో వేసి వాటిని పేస్ట్‌ల సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మొటిమలున్న ప్రదేశాల్లో అప్లై చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి