Benefits of Mushrooms: పుట్టెడు లాభాల పుట్టగొడుగు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టారు..

పుట్టగొడుగులను వివిధ రకాలుగా వినియోగిస్తారు. వెజ్, నాన్ వెజ్‌ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మష్రూమ్స్‌ ఆరోగ్యానికి దివ్యౌషధంగా పని చేస్తుంది.

Benefits of Mushrooms: పుట్టెడు లాభాల పుట్టగొడుగు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టారు..
Mushrooms Beneficial
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2022 | 1:42 PM

Benefits of Mushrooms: మనం రోజు తీసుకునే ఆహారంలో అప్పుడప్పుడూ పుట్టగొడుగులు చేర్చడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన దేశంలో పుట్టగొడుగులు విరివిగా లభిస్తాయి. ప్రస్తుతం వీటి వినియోగం పెరడం వల్ల మష్రూమ్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. పుట్టగొడుగులను వివిధ రకాలుగా వినియోగిస్తారు. వెజ్, నాన్ వెజ్‌ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మష్రూమ్స్‌ ఆరోగ్యానికి దివ్యౌషధంగా పని చేస్తుంది. అయితే పుట్టగొడుగులను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. పుట్టగొడుగులకు అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92% నీటిని కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పుట్టగొడుగుల్లో పోషకాలు, అనేక రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. వీటి వల్ల హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. పుట్టగొడుగుల్లో పోషకాలు, అనేక రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. మష్రూమ్స్‌ శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి హాయపడతాయి. పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం మొదలైన పొట్ట సమస్యలు దూరమవుతాయి.

పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా చేస్తాయి. అంతేకాదు వీటిలో క్యాలరీలు తక్కువ. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పుట్టగొడుగులలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి లభిస్తుంది. పుట్టగొడుగుల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరానికి యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కణాలను రిపేర్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్