Health: బాదం పప్పు పొట్టు తీసి తింటున్నారా.. అయితే ఈ ప్రయోజనాలు కోల్పోతున్నట్లే
కాలం మారుతున్న కొద్దీ జీవన విధానంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నిద్ర వేళలు మారిపోతుండటంతో వ్యాధుల ముప్పు అధికమవుతోంది. అందుకే ప్రస్తుతం అందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు...
కాలం మారుతున్న కొద్దీ జీవన విధానంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నిద్ర వేళలు మారిపోతుండటంతో వ్యాధుల ముప్పు అధికమవుతోంది. అందుకే ప్రస్తుతం అందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. హెల్త్ (Health Tips) కు ఏది మంచిదైతే దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్రైఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Helath Benefits) ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు, వాల్ నట్స్, అంజీర్, రైసిన్స్ ఇలా వేటికవే ప్రత్యేకంగా పోషక విలువను కలిగి ఉన్నాయి. మంచి కొవ్వులు, విటమిన్లతో పాటు అనేక రకాల ఖనిజాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పు, బాదంపప్పుల్లో మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పిస్తాలోని బీ6 విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడకుండా కాపాడుతుంది. ఎండుద్రాక్షలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. గింజపప్పులు, ఎండుఫలాలు కొలెస్ట్రాల్ తగ్గటానికీ తోడ్పడతాయి. పొటాషియం, విటమిన్ ఎ, పీచు, రాగి ఒంట్లో శక్తి తగ్గకుండా చూస్తాయి.
జీడిపప్పులో రాగి ఎక్కువగా ఉండటం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవి ఎముక పుష్టికి, మంచి చూపుకు సహాయపడతాయి. బాదంపప్పులో కాల్షియంతో పాటు విటమిన్ ఇ కూడా అధికంగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాదు. చర్మం ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిది. ఎందుకంటే గుండెను కాపాడే ఫ్లావనాయిడ్లు ఈ పొట్టులోనే ఉంటాయి. వాల్‌నట్స్ లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి.
నోట్ – ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు పాటించడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..