Railway Jobs: టెన్త్ పాస్ అయ్యారా.. రైల్వేలో 5 వేలకు పైగా ఉద్యోగాలు మీ కోసమే
నిరుద్యోగులకు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే(Northeast Frontier Railway) శుభవార్త చెప్పింది. అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్ఎఫ్ఆర్ అధికారిక వెబ్‌సైట్ nfr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు...
నిరుద్యోగులకు ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే(Northeast Frontier Railway) శుభవార్త చెప్పింది. 5,636అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్ఎఫ్ఆర్ అధికారిక వెబ్‌సైట్ nfr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభమైంది. జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చిని వెల్లడించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాస్ అవ్వాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10+2 పరీక్షా విధానంలో తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నోటిఫైడ్ ట్రేడ్‌లో ఐటీఐ కూడా ఉండాలి.
వయో పరిమితి: కనీస వయస్సు: 15 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు
ముఖ్యమైన తేదీలు:ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: జూన్ 01, 2022 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2022
ఎలా దరఖాస్తు చేయాలి: అధికారిక వెబ్‌సైట్‌ను nfr.indianrailways.gov.in . ద్వారా అప్లై చేసుకోవచ్చు ‘NFR రిక్రూట్‌మెంట్ 2022’ – పై క్లిక్ చేయండి వివరాలను పూరించి, అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను తనిఖీ చేసి సమర్పించండి. ప్రాసెసింగ్ ఫీజు: రూ. 100/- SC/ ST, PWD & మహిళా అభ్యర్థులకు: Nil చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్ లేదా పోస్టల్ ఆర్డర్
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..