Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళా.. 15 కంపెనీలు, 1500కిపైగా ఉద్యోగాలు..
Job Mela: ఒకప్పుడు కంపెనీలు నేరుగా జాబ్ మేళాలు నిర్వహించేవి. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు తరుచూ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..
Job Mela: ఒకప్పుడు కంపెనీలు నేరుగా జాబ్ మేళాలు నిర్వహించేవి. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు తరుచూ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉచితంగా శిక్షణ అందించిన పోలీస్ శాఖ తాజాగా హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. జూన్ 6న హైదరాబాద్‌లో జరగనున్న ఈ జాబ్‌మేళాలో మొత్తం 15 కంపెనీలు పాల్గొననున్నాయి. 1500 మందికి పైగా ఉద్యోగులను తీసుకోనున్నారు. జాబ్ మేళాలో ఏయే కంపెనీలు పాల్గొననున్నాయి.? అర్హతలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
పాల్గొననున్న కంపెనీలు, అర్హతలు..
జాబ్ మేళాలో భాగంగా టీఎమ్ గ్రూప్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బిగ్ బాస్కెట్, విజయ డయగ్నోస్టిక్ సెంటర్, అపోలో ఫార్మసీ, ఎయిర్‌టెల్‌తో పాటు మరికొన్ని కంపెనీలు పాల్గొననున్నాయి. జాబ్ మేళాకు హాజరయ్యే వారు పోస్టుల ఆధారంగా ఇంటర్ నుంచి డిగ్రీ పూర్తి చేయాలి.
ఇంటర్వ్యూలు జరిగే ప్రదేశం..
జాబ్‌మేళాను జూన్ 29న నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలను హెరిటేజ్ ప్యాలెస్, 1-47-908/4, ముషీరాబాద్ మెయిన్ రోడ్, ముషీరాబాద్, కావాడిగూడ, హైదరాబాద్-500020 అడ్రస్‌లో నిర్వహిస్తారు.
ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఈ లింక్ (bit.ly/jcepass) ఓపెన్ చేసి, అప్లికేషన్ ఫామ్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం ఫామ్‌లో పేర్కొన్న అన్ని వివరాలను ఎంటర్ చేయాలి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..