అడవిలో అందమైన నెమలి.. పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్‌ అడిగితే ఎలా ఉంటుంది.. క్యూట్‌ సీన్‌ వైరల్‌

సోషల్ మీడియాలో పుష్కలంగా ఉన్న విజువల్స్ మనల్ని మళ్లీ మళ్లీ అలాంటి వీడియోలనే చూసేలా చేస్తాయి. అలాంటి సన్నివేశాలు మనలో ఉత్సాహాన్ని పెంచి సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి దృశ్యమే వైరల్‌ అవుతోంది.

అడవిలో అందమైన నెమలి.. పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్‌ అడిగితే ఎలా ఉంటుంది.. క్యూట్‌ సీన్‌ వైరల్‌
Peacock Asking Lift
Jyothi Gadda

|

Jun 26, 2022 | 12:27 PM

నెమళ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి…? నృత్యం, నాట్యానికి ప్రసిద్ధి చెందిన పక్షులు నెమళ్లు. అయితే, ఈ అందమైన పక్షులు ఒక్కోసారి వాహనంలో లిఫ్ట్‌ అడిగి ఎక్కుతాయంటే నమ్ముతారా…? ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో పుష్కలంగా ఉన్న విజువల్స్ మనల్ని మళ్లీ మళ్లీ అలాంటి వీడియోలనే చూసేలా చేస్తాయి. అలాంటి సన్నివేశాలు మనలో ఉత్సాహాన్ని పెంచి సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి దృశ్యమే వైరల్‌ అవుతోంది. ఇది చూడదగ్గ దృశ్యం. ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి. ఇది @Yoda4ever అనే ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడిన వీడియో. ఈ 7-సెకన్ల క్లిప్ నెటింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

చుట్టూ పంటపొలాలు, పచ్చని చెట్లతో నిండిన ఆ ప్రాంతంలో ఓ రోడ్డుపై ట్రక్కులాంటి వాహనం వెల్తోంది. అందులో ముందుగానే ఓ నెమలి ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాహనం వేగంగా వెళ్తుండగా, వేగంగా మరో నెమలి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని చూడగానే ఆ వాహనదారుడు సడెన్‌ బ్రెక్‌ వేసి వెహికిల్ ఆపేశాడు. ఆ నెమలి లిఫ్ట్‌ అడినట్టుగా ఉందే అని భావించిన సదరు వాహనం డ్రైవర్‌ బండి ఆపేయటంతో నెమలి ఏంచక్కా వాహనం ఎక్కేసింది. ఈ సీన్ చూస్తే నవ్వొస్తుంది. ఈ అందమైన వీడియోకి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భిన్నమైన కామెంట్లతో వీడియోను మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Peacock

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu