Viral Photo: చంద్రబింబం.. చారడేసి కళ్లతో ముద్దులొలుకుతున్న చిన్నారి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టండి..
చంద్రబింబం.. చారడేసి కళ్లతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. త్రోబ్యాక్ అంటూ నెట్టింట తారల బాల్యం తాలుకూ జ్ఞాపకాలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్, కాజల్, తమన్నా, కృతి శెట్టి ఇలా ఒక్కరేమిటీ.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్క స్టార్స్ ఫోటోస్ నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదూ..
చంద్రబింబం.. చారడేసి కళ్లతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.. మీకోసం మరో చిన్న క్లూ.. గోపిచంద్, నితిన్, శ్రీకాంత్ లతో పలు హిట్ చిత్రాల్లో నటించింది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఎవరో గుర్తుపట్టండి..
పైన ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదండి.. మలయాళ కుట్టి భావన.. శ్రీకాంత్ సరసన మహాత్మ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఒంటరి, హీరో చిత్రాల్లో నటించింది. దశాబ్ద సినీ కెరీర్ లో ఆమె దాదాపు 70 చిత్రాల్లో నటించి మెప్పించింది..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..