AP Municipal Polls Voter Slip: మీకు ఓటర్ స్లిప్ ఇవ్వలేదా..? ఇంట్లోనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..
ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటర్ స్లిప్ కలిగి ఉండాలి. అధికారులు ఇంటింటికి వచ్చి దీనిని పోలింగ్‌కు ముందు అందిస్తారు. ఒకవేళ మీ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే మీరు ఆన్ లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇదెలా అనేది చూద్దాం.

ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికల పోలింగ్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగా.. త్వరలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 8 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్ పర్సన్లు, వార్డు సభ్యులు ఏకగ్రీవమవ్వగా.. మిగతా స్థానాలైన 82 పట్టణ సంస్థలకు పోలింగ్ నడుస్తోంది. 11,705 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుండగా.. 99,36,014 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 36,3514 మంది పోలీసులు మోహరించారు. 3103 మందితో మొబైల్ టీమ్స్, 405 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 1.5 లక్ష మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఓటర్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా..?
అయితే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటర్ స్లిప్ అనేది తప్పనిసరి. ఓటర్ స్లిప్ లేకుండా ఓటు హక్కు వినియోగించుకోలేము. ఎన్నికల అధికారులు ప్రతీ ఇంటికి వచ్చి ఓటర్లకు ఓటర్ స్లిప్పులు అందిస్తారు. దీనితో పాటు ఓటర్ ఐడీ కార్డు, ఆధార్, పాన్ లాంటి ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే అధికారులు మీకు ఓటర్ స్లిప్ అందించకపోయినా, అధికారులు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేకపోయినా ఇబ్బంది పడనక్కర్లేదు. ఆన్‌లైన్ ద్వారా సులువుగా ఓటర్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ ఓటర్ ఐడీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఇంటి వద్ద నుంచే ఓటర్ స్లిప్ డౌన్ లోడ్ కేసుకోవచ్చు. ఇదెలా అనేది చూద్దాం.
స్టెప్ బై స్టెప్
-ఏపీ ఎన్నికల కమిషన్ పోర్టల్ https://sec-ems.ap.gov.in/apsec/downloadVoterSlip ఓపెన్ చేయాలి
-సెర్చ్ బై ఈపీఐసీ లేదా సెర్చ్ బై డీటైల్స్ అనే ఆప్షన్లలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి
-అనంతరం రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్‌లలో ఒకటి ఎంచుకోవాలి
-అర్బన్ లోకల్ బాడీస్‌లో నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, వీఎంసీ, జీవీఎంసీ ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవాలి
-అనంతరం జిల్లా, మీ మున్సిపాలిటీ, ఓటర్ ఐడీ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి
-స్క్రీన్‌పై మీ ఓటర్ స్లిప్ కనిపిస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు
-ఓటర్ స్లిప్‌ను ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
