Tollywood : ఎంత పని చేశావ్ బ్రో.. మీసం తీసేయ్ అన్న డైరెక్టర్.. నో చెప్పి చేతులారా బ్లాక్‌బస్టర్ హిట్ మిస్సైన హీరో..
కొన్ని సందర్భాల్లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో నటుడి చెంతకు చేరుతుంది. అయితే అది అప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్ కారణమైనా కావచ్చు.. లేదంటే డైరెక్టర్ చెప్పిన కండీషన్స్ వల్ల కావచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సీనియర్ హీరో డైరెక్టర్ మణిరత్నం చెప్పిన ఓ మాటకు నో చెప్పి చేతులరా నేషనల్ అవార్డ్ మిస్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ? ఏం జరిగింది ? అనే విషయాలు తెలుసుకుందామా.

దిగ్గజ దర్శకుడు మణిరత్నం సినిమాలో ఒక్క చిన్న పాత్ర దక్కినా చాలు అని భావించే నటీనటులు ఎందరో ఉన్నారు. కానీ అలాంటి లెజెండరీ డైరెక్టర్ పెట్టిన నిబంధనలు నచ్చక, ముఖం మీదే ‘నో’ చెప్పి బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్నాడు ఓ హీరో. ఆయన మరెవరో కాదు.. సీనియర్ నటుడు శరత్ కుమార్. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. కానీ ఆయన కెరీర్ లో అనేక హిట్ చిత్రాలు మిస్సయ్యారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ కూడా ఉంది. ఇందుకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ చిత్రం ‘ఇద్దరు’ (తమిళంలో ‘ఇరువర్’). ఈ సినిమాలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పాత్రను పోలిన ఒక బలమైన రోల్ కోసం తొలుత మిథున్ చక్రవర్తి, నానా పటేకర్ వంటి దిగ్గజాలను సంప్రదించగా వారు నిరాకరించారు. ఆ తర్వాత ఆ పాత్ర కోసం మణిరత్నం నటుడు శరత్ కుమార్‌ను సంప్రదించారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
అయితే చర్చల సమయంలో మణిరత్నం ఏకపక్షంగా పలు షరతులు విధించారట. పాత్ర కోసం వెంటనే మీసం తీసేయాలని, క్రాపింగ్ చేయించుకోవాలని, రేపటి నుంచే షూటింగ్‌కు రావాలని చెప్పారట. అయితే మీసం తీసేయడం తనకు ఇష్టం లేకపోవడంతో ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించారు శరత్ కుమార్. అంతేకాకుండా ఈ హీరో స్పందిస్తూ.. “ఇతర సినిమాల కంటిన్యూటీ గురించి ఆలోచించకుండా మీసం తీసేయ్ అంటున్నారు. అది నా వల్ల కాదు అంటూ సున్నితంగా ఆ ఆఫర్ రిజెక్ట్ చేశారట మణిరత్నం. శరత్ కుమార్ వదులుకున్న ఆ ప్రతిష్టాత్మక పాత్రను చివరకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోషించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ చూపించిన అద్భుతమైన నటనకుగానూ ఉత్తమ సహాయ నటుడిగా ఏకంగా జాతీయ అవార్డు వరించడం విశేషం. ఆ విధంగా ఆ ఒక్క మీసం కండిషన్ వల్ల శరత్ కుమార్ ఒక బ్లాక్‌బస్టర్ సినిమాతో పాటు నేషనల్ అవార్డ్ కొట్టే సువర్ణావకాశాన్ని మిస్ చేసుకున్నారు. రాజకీయాలు, సినిమా , స్నేహం నేపథ్యంలో సాగే ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య రాయ్, గౌతమి, రేవతి వంటి దిగ్గజ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
శరత్ కుమార్..

Maniratnam, Sarath Kumar
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
