AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కివీస్ సిరీస్‌కు ముందు షాకింగ్ సీన్.. కోహ్లీని ముప్పుతిప్పలు పెట్టిన కుర్ర పేసర్

Virat Kohli: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు. ఈ ప్రాక్టీస్‌లో యువ పేసర్ ఆకిబ్ నబీ విరాట్ కోహ్లీని పదేపదే ఇబ్బంది పెట్టాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ కోహ్లీ బ్యాట్‌ను దాటించాడు. ప్రసిద్ధ్ కృష్ణ గాయంతో జట్టులోకి వచ్చిన ఆకిబ్ ప్రదర్శన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Virat Kohli: కివీస్ సిరీస్‌కు ముందు షాకింగ్ సీన్.. కోహ్లీని ముప్పుతిప్పలు పెట్టిన కుర్ర పేసర్
Virat Kohli
Rakesh
|

Updated on: Nov 01, 2026 | 9:22 AM

Share

Virat Kohli: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయం జరిగిన నెట్స్ ప్రాక్టీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ ప్రాక్టీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం యువ పేసర్ ఆకిబ్ నబీ. అనుభవజ్ఞుడైన కోహ్లీని అతడు పదేపదే ఇబ్బంది పెట్టినట్లు రిపోర్టులు వెల్లడించాయి. కొన్ని బంతులు కోహ్లీ బ్యాట్ అంచును దాటిపోగా, మరికొన్ని నేరుగా ప్యాడ్లకు తగిలాయి. దీంతో నెట్స్‌లో ఆసక్తికర వాతావరణం కనిపించింది.

బంతిని రెండు వైపులా స్వింగ్ చేసిన ఆకిబ్

రివ్‌స్పోర్ట్జ్ కథనం ప్రకారం.. ఆకిబ్ నబీ తన బౌలింగ్‌తో కోహ్లీకి గట్టి సవాల్ విసిరాడు. ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ బంతులతో అతడిని పరీక్షించాడు. ముఖ్యంగా వేగంగా లోపలికి దూసుకొచ్చిన బంతులు కోహ్లీ ప్యాడ్లకు, తొడ భాగానికి తగిలాయి. పలుమార్లు బ్యాట్‌ను దాటుతూ వెళ్లిన బంతులతో కోహ్లీ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కోహ్లీ వెంటనే తేరుకుని మళ్లీ తన సహజమైన ఆటతో సాధన కొనసాగించాడు. మధ్యలో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడుతూ తన టైమింగ్‌ను కూడా చూపించాడు.

ప్రసిద్ధ్ స్థానంలో జట్టులోకి ఆకిబ్

ఆకిబ్ నబీకి ఈ ప్రాక్టీస్ సెషన్ మరింత ప్రత్యేకం. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అతడికి అవకాశం దక్కింది. అంతకుముందు న్యూజిలాండ్‌లో ఇండియా ఏ తరఫున జరిగిన తొలి అనధికారిక టెస్టులో ఆకిబ్ ఆకట్టుకున్నాడు. అక్కడ చూపిన ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగిస్తూ సీనియర్ బ్యాటర్లకు ఇబ్బందులు సృష్టించాడు. అతడితో పాటు అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ కూడా నెట్స్‌లో బౌలింగ్ చేశారు. గుర్నూర్ తన ఎత్తుతో బౌన్స్ రాబట్టగా, కాంబోజ్ కచ్చితమైన లైన్‌లో బంతులు వేశాడు.

రోహిత్, రాహుల్ కూడా సాధన

కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా నెట్స్‌లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. వేగంగా పరుగులు చేయడం కంటే బంతి స్వభావాన్ని అర్థం చేసుకుంటూ డిఫెన్స్, అవసరమైనప్పుడు షాట్లు ఆడటంపై దృష్టి పెట్టాడు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత కోహ్లీ, రోహిత్ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. కేఎల్ రాహుల్ కొంత ఆలస్యంగా నెట్స్‌లోకి వచ్చి సాధన చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా యువ పేసర్ల బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు.

తొలి వన్డేకు ముందు కీలక సాధన

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డేకు మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. స్థానిక పిచ్‌పై బంతి ఎలా స్పందిస్తోంది? పేసర్లకు ఎంత బౌన్స్, స్వింగ్ లభిస్తోంది? అనే విషయాలను బ్యాటర్లు అంచనా వేసేందుకు ఈ సాధన ఉపయోగపడింది. ముఖ్యంగా ఆకిబ్ నబీ లాంటి యువ బౌలర్ నుంచి ఎదురైన సవాలు భారత బ్యాటర్లకు మంచి పరీక్షగా మారింది. తొలి వన్డేలో అతడికి తుది జట్టులో అవకాశం వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కోహ్లీని ముప్పుతిప్పలు పెట్టిన కుర్ర పేసర్
కోహ్లీని ముప్పుతిప్పలు పెట్టిన కుర్ర పేసర్
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?