AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురసు ముంచుకొస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. తుపాను ఏపీ తీరానికి ఎంత దూరంలో ఉందంటే..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి ‘మురసు’ అని పేరు పెట్టనున్నారు. నవంబర్ 3న నెల్లూరు–నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా. ఏపీ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు జారీ కాగా, తెలంగాణలోనూ హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Shaik Madar Saheb
|

Updated on: Nov 01, 2026 | 10:29 AM

Share
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం మరింత బలపడింది.. కాసేపట్లో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 700 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 770 కి.మీ దూరంలో కేంద్రీకృతమయింది. గడిచిన 6 గంటల్లో తీవ్రవాయుగుండం గంటకు 23 కి.మీ. వేగంతో కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 770 కి.మీ, ఒంగోలుకు తూర్పు ఆగ్నేయంగా 810 కి.మీ దూరంలో ఉంది. రేపటికి  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుపానుగా మారితే మురసు అని నామకరణం చేయనున్నారు. మురసు తుఫాన్‌ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు.

1 / 5
ఏపీ తీరం వైపు గంటకు 23 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంది ఈ తుఫాను .. నవంబర్ 3న ఉదయం నెల్లూరు - నరసాపురం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

2 / 5
తుఫాన్ ముప్పు పొంచి ఉండడంతో.. సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అర్నబ్‌ తుఫాన్‌ను ఎలాగైతే ఎదుర్కొన్నామో... అంతకమంటే కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ... ప్రజలకు భరోసా ఇవ్వాలని సూచించారు.

3 / 5
సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను తీర ప్రాంత ప్రజలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

4 / 5
తుపాను ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతవారణ శాఖ తెలిపింది. ఆదివారం, సోమవారం హైదరాబాద్ సహా.. అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు.. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

5 / 5
Follow Us