AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana: ధోనీ నుంచి స్మృతి మంధానకు వాట్సాప్ మెసేజ్.. అందులో ఏముందో తెలుసా?

Smriti Mandhana: 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత ఎంఎస్ ధోనీ స్మృతి మంధానకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్‌లో జట్టులోని అందరికీ శుభాకాంక్షలు చెప్పాలని కోరారు. ఫోన్ ఎక్కువగా వాడని ధోనీ నుంచి వచ్చిన ఈ సందేశం తనకు ఎంతో సంతోషం కలిగించిందని స్మృతి తాజాగా వెల్లడించింది.

Smriti Mandhana: ధోనీ నుంచి స్మృతి మంధానకు వాట్సాప్ మెసేజ్.. అందులో ఏముందో తెలుసా?
Smriti Mandhana
Rakesh
|

Updated on: Nov 01, 2026 | 10:00 AM

Share

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు 2025లో తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి ఓ ప్రత్యేక సందేశం అందిందని స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తాజాగా వెల్లడించింది. ముంబైలో గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ 125వ వార్షికోత్సవ కార్యక్రమంలో ధోనీతో కలిసి వేదిక పంచుకున్న స్మృతి ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రపంచకప్ గెలిచిన వెంటనే ధోనీ తనకు వాట్సాప్‌లో మెసేజ్ పంపించి, జట్టులోని అందరికీ అభినందనలు తెలియజేయాలని కోరినట్లు చెప్పింది.

ధోనీ ఫోన్ ఎక్కువగా ఉపయోగించరనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి స్వయంగా వాట్సాప్‌లో మెసేజ్ పంపడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని స్మృతి చెప్పింది. ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీ నుంచి అభినందనలు రావడం ప్రత్యేక అనుభూతి అని వివరించింది. ఈ మాటలు చెబుతున్నప్పుడు వేదికపై ఆసక్తికరమైన సంభాషణ సాగింది. స్మృతి దగ్గర ధోనీ ఫోన్ నంబర్ ముందే ఉందని తెలిసి కార్యక్రమ నిర్వాహకుడు కూడా సరదాగా స్పందించారు.

స్మృతికే ఎందుకు మెసేజ్ చేశానంటే..

దీనిపై ధోనీ కూడా అసలు విషయం వెల్లడించాడు. మహిళల జట్టులో తనకు స్మృతి మంధాన నంబర్ మాత్రమే తెలుసని చెప్పాడు. ఇటీవల ఇద్దరూ కలిసి ఓ ప్రకటనలో నటించడంతో ఆమె ఫోన్ నంబర్ తన దగ్గర ఉందని వివరించాడు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత మొత్తం జట్టుకు అభినందనలు తెలియజేయాలని అనుకున్నానని, అందుకే స్మృతికి మెసేజ్ పంపి అందరికీ తన శుభాకాంక్షలు చెప్పాలని కోరినట్లు తెలిపాడు. అంటే ఆ మెసేజ్ స్మృతికి మాత్రమే కాదు.. ప్రపంచకప్ గెలిచిన ప్రతి ఒక్కరికీ అని ధోనీ స్పష్టం చేశాడు.

మహిళల క్రికెట్‌కు కొత్త దారి

2025 నవంబర్ 2న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలీ వర్మ 87 పరుగులతో అదరగొట్టగా, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో 58 పరుగులు చేసి, బౌలింగ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించింది. స్మృతి మంధాన కూడా టోర్నీలో 434 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంది.

భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ఈ ప్రపంచకప్

ఈ ప్రపంచకప్ విజయం కేవలం ఓ ట్రోఫీ గెలవడం మాత్రమే కాదని ధోనీ అభిప్రాయపడ్డాడు. భారత మహిళా క్రికెట్ ముందుకు వెళ్లే తీరును ఈ విజయం మార్చేస్తుందని చెప్పాడు. భవిష్యత్తులో అమ్మాయిలు క్రికెట్‌ను ఓ వృత్తిగా ఎంచుకునేందుకు ఈ విజయం మార్గం చూపుతుందని వివరించాడు. దేశం కోసం పెద్ద ట్రోఫీ సాధించడంతో పాటు, తర్వాతి తరాల అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారని మహిళా క్రికెటర్లను ప్రశంసించాడు. ప్రపంచకప్ గెలిచి ఏడాది దాటినా ఆ విజయం గురించి ధోనీ, స్మృతి పంచుకున్న ఈ చిన్న సంఘటన ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us