AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు.. భారత్‌తో చివరి టీ20లో కివీస్ స్టార అరుదైన ఛాన్స్

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదో టీ20లో గ్లెన్ ఫిలిప్స్ మూడు కీలక రికార్డులపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే 276 పరుగులు చేసిన అతడు మరో 56 పరుగులు చేస్తే ఒక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డు సాధించగలడు. కివీస్ తరఫున అత్యధిక టీ20 సెంచరీలు, అత్యధిక సిక్సర్ల జాబితాలోనూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

IND vs NZ: ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు.. భారత్‌తో చివరి టీ20లో కివీస్ స్టార అరుదైన ఛాన్స్
Glenn Phillips
Rakesh
|

Updated on: Nov 01, 2026 | 10:50 AM

Share

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ వేదికగా ఈరోజు జరగనున్న ఈ పోరులో టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకుంది. చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను ఘనంగా ముగించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే ఈ పోరులో అందరి దృష్టి కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌పైనే ఉంది. ఈ సిరీస్‌లో భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న అతడు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 276 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే శతకం బాదిన ఫిలిప్స్.. ఈరోజు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడితే మూడు కీలక రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.

ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు

ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 331 పరుగులు సాధించాడు. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్ ఖాతాలో 276 పరుగులు ఉన్నాయి. ఈరోజు మరో 56 పరుగులు చేస్తే 332 పరుగులకు చేరుకుంటాడు. అప్పుడు ఫిల్ సాల్ట్ రికార్డును అధిగమించి ఒక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20 సెంచరీలు

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్, కాలిన్ మున్రో, ఫిన్ అలెన్ సమంగా ఉన్నారు. వీరంతా ఇప్పటివరకు మూడేసి సెంచరీలు సాధించారు. ఈరోజు భారత్‌పై మరో శతకం బాదితే ఫిలిప్స్ నాలుగో సెంచరీతో న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20 శతకాలు చేసిన బ్యాటర్‌గా ఒంటరిగా అగ్రస్థానానికి చేరుకుంటాడు. గత మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన అతడిపై ఈ రికార్డుపై భారీ అంచనాలు ఉన్నాయి.

సిక్సర్ల జాబితాలో రెండో స్థానం

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన న్యూజిలాండ్ ఆటగాళ్ల జాబితాలో మార్టిన్ గప్టిల్ 173 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరూ చెరో 125 సిక్సర్లతో సమంగా ఉన్నారు. ఈరోజు ఒక్క సిక్సర్ బాదినా ఫిలిప్స్ 126 సిక్సర్లతో అలెన్‌ను దాటి రెండో స్థానానికి చేరుకుంటాడు. గప్టిల్ రికార్డును అందుకోవాలంటే మాత్రం ఇంకా చాలా సిక్సర్లు అవసరం.

ఫిలిప్స్ జోరు కొనసాగుతుందా?

ఈ సిరీస్‌లో ఫిలిప్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సెడాన్ పార్క్‌లోనూ అతడి బ్యాటింగ్ దూకుడుగా సాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 195 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన రికార్డు అతడికి ఉంది. అయితే ఈరోజు రికార్డులు సాధించాలంటే భారత బౌలర్లను మరోసారి సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మూడు రికార్డుల్లో ఎన్ని ఫిలిప్స్ ఖాతాలో చేరతాయో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us