AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : స్టార్ హీరో అయినా రవ్వంత అహం కూడా ఉండదు.. సెట్‏లో జోక్స్ వేస్తూ రచ్చ రచ్చ చేస్తారు.. టాలీవుడ్ నటుడు..

హాస్యనటుడు గుండు సుదర్శన్ అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, తెలుగు చిత్ర పరిశ్రమలో చోటుచేసుకున్న మార్పులపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నగరానికి వచ్చిన కళాకారుల కష్టాలు, ఆకలి లేదా అవమానాల నుండి నిజమైన ప్రేరణ ఎలా వస్తుందో ఆయన వివరించారు. గతంలో క్యారవాన్‌లు వంటి సౌకర్యాలు లేని స్థితి నుండి నేడు చిన్న ఆర్టిస్టులకు కూడా ప్రాథమిక వసతులు అందుబాటులోకి రావడం, బడ్జెట్‌లు, రెమ్యూనరేషన్‌లు పెరగడం వంటి మార్పులను చెప్పుకొచ్చారు.

Tollywood : స్టార్ హీరో అయినా రవ్వంత అహం కూడా ఉండదు.. సెట్‏లో జోక్స్ వేస్తూ రచ్చ రచ్చ చేస్తారు.. టాలీవుడ్ నటుడు..
Gundu Sudarshan
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2026 | 10:54 AM

Share

హాస్యనటుడు గుండు సుదర్శన్ గురించి తెలుగు ప్రేక్షకులక సుపరిచితమే. ఎన్నో దశాబ్దాలుగా సినీరంగంలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమలో తన అనుభవాలు, పరిశ్రమలో వచ్చిన మార్పులు, సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన అనుబంధం గురించి వివరించారు. ఆయన మాటల్లో సినీ ప్రపంచం ప్రస్థానం, కష్టాలు, విజయాలు స్పష్టంగా కనిపించాయి. నగరానికి వచ్చే కళాకారుల జీవితాన్ని సుదర్శన్ ప్రస్తావిస్తూ, చాలామంది కృష్ణానగర్ కథల మాదిరిగానే ఎన్నో బాధలతో, కష్టాలతో వస్తారని తెలిపారు. తాతలు సంపాదించిన ఆస్తిపై ఆధారపడకుండా, సొంతంగా నిలదొక్కుకోవడానికి కృషి చేసేవారే నిజమైన తృప్తిని పొందుతారని అన్నారు. ఒక వ్యక్తిని నిజంగా ప్రేరేపించేది ఆకలి లేదా అవమానం నుండే అని, ప్యాషన్ అని చెప్పుకునేవారిలో ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుందని గుండు సుదర్శన్ చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని దశాబ్దాలుగా వచ్చిన మార్పులను ఆయన వివరించారు. ఒకప్పుడు క్యారవాన్‌లు లేక, నటీనటులు చెట్ల కిందే బట్టలు మార్చుకుని షూటింగ్‌లకు వెళ్లిన రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు క్యారవాన్‌లు ఒక లగ్జరీ కాదని, అది ఒక అవసరమని, దుస్తులు మార్చుకోవడానికి, ఇతర ప్రాథమిక అవసరాలకు అవి తప్పనిసరని అన్నారు. కాలక్రమేణా షూటింగ్ స్పీడ్ పెరిగిందని, బడ్జెట్‌లు భారీగా పెరిగాయని, రెమ్యూనరేషన్‌లు కూడా గణనీయంగా వృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విధానాన్ని గుండు సుదర్శన్ పంచుకున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ తెలుగు సినిమాలను, నటులను పెద్దగా పట్టించుకోలేదని, గౌరవం కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. “వీళ్ళు సినిమానా? వీడు యాక్టరా?” అన్నట్టుగా చూసేవారని అన్నారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా పాన్-ఇండియా స్థాయికి ఎదగడం, ప్రపంచమంతా మన వైపు చూడటం గర్వకారణం అన్నారు. మన హీరోలు, డైరెక్టర్ల వల్లే టాలీవుడ్‌కు ఈ గౌరవం దక్కిందని, తెలుగు యాక్టర్ అంటే ఒక చిన్న గౌరవం లభిస్తోందని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన అనుభవాలు అద్భుతమైనవని గుండు సుదర్శన్ వెల్లడించారు. మహేష్ బాబు చాలా సీరియస్‌గా ఉంటారని జనం అనుకుంటారని, కానీ ఆయన ఆఫ్-స్క్రీన్‌లో పంచ్‌లు వేస్తూ, జోకులు చెబుతూ చాలా జోవియల్ గా ఉంటారని సుదర్శన్ తెలిపారు. మహేష్ బాబును “డైరెక్టర్స్ హీరో” అని పేర్కొంటూ, ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటించే నటుడని అన్నారు. సెట్‌లో మహేష్‌ బాబులో స్టార్‌డమ్, అహం ఉండదని, ఎంతో వినయంతో, వాత్సల్యంతో అందరితో కలిసిపోతారని సుదర్శన్ కొనియాడారు. ఆయన తండ్రిగారు కృష్ణ గారి నుండి వచ్చిన సంస్కారం ఇది అని, ఇదే ఆయన గొప్ప నిధి అని అన్నారు. మహేష్‌తో నటించిన 90 శాతం మంది నటులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తారని సుదర్శన్ చెప్పారు. ఇటీవల తన “ఆంధ్ర” చిత్రం నుండి ఒక డైలాగ్ రీల్స్‌లో పారడీ చేయబడిందని ఆయన సరదాగా పంచుకున్నారు, ఇది ఇండస్ట్రీలో మార్పులకు నిదర్శనం అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

గుండు సుదర్శన్, మహేష్ బాబు..

Gundu Sudarshan, Mahesh Bab

Gundu Sudarshan, Mahesh Bab

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us