Bigg Boss Telugu 10: అతనికి బిగ్ బాస్ కప్పు గెలవడం చిటికెలో పని.. కానీ చేజేతులా నాశనం చేసుకున్నాడు: కౌశల్
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గురించి తనదైన విశ్లేషణలు ఇస్తున్నారు కౌశల్ మందా. రెండో సీజన్ విజేతగా నిలిచిన ఆయన ఇప్పుడు పదో సీజన్ గురించి కూడా అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు. ఆయన బిగ్ బాస్ రివ్యూ వీడియోలకు అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఎనిమిదో వారం కూడా ఎండింగ్ కు వచ్చేసింది. గతంలో బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స, విజేతలు ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూయర్లుగా మారిపోయారు. ఈ రియాలిటీ షో గురించి తమదైన విశ్లేషణలు, రివ్యూలు అందిస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ గురించి. ప్రస్తుతం సినిమాలు, బిజినెస్ వ్యవహరాలతో బిజీగా ఉంటోన్న ఆయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గురించి తన దైన శైలిలో విశ్లేషణలు అందిస్తున్నారు. ఆయన వీడియోలకు అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నటుడు శివాజీ గురించి కౌశల్ మండా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో శాలిని పాల్గొన్నటువంటి ఒక చిన్న క్లిప్ షేర్ చేశారు కౌశల్. ఇందులో శివాజీ షాలినీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించారు. ఈ వీడియోపై స్పందించిన కౌశల్ ఇలా చెప్పుకొచ్చారు..
‘నిజంగానే శివాజీ గారు బజ్ కార్యక్రమంలో చూపించిన నవరసాలు బిగ్ బాస్ హౌస్ లో కనుక చూపించి ఉంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవారు. నాకు తెలిసిన శివాజీ గారు ఇది కాదు.. ఎందుకంటే నేను ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్, సినిమా ఎక్స్పీరియన్స్ ,నాలెడ్జ్ చూస్తే ఈయన చాలా డిఫరెంట్ అని అనిపిస్తుంది. నిజంగానే శివాజీ గారు బిగ్ బాస్ కప్పు గెలవాలి అనుకుంటే చిటికెలో జరిగే పని. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆయనలో వేరే కోణం చూశాం. నిజంగానే బిగ్ బాస్ కప్ నీట్ గా శుభ్రం చేసి ఎవరు ఊహించని విధంగా అప్పటికీ ఎవరికీ తెలియని పల్లవి ప్రశాంత్ చేతిలో పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత హీరోలు కాస్త జీరోలు అవుతారు.. జీరోలు కాస్త హీరోలు అవుతారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత మనం ఎలా ఉన్నామో మనకి తెలియు. ఒకసారి హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా జరగొచ్చు అందుకు ఉదాహరణ శివాజీ గారు. నేను బయట చూసిన శివాజీ గారు వేరు హౌస్ లో చూసిన శివాజీ గారు వేరు. ఇప్పుడు బిగ్ బాస్ బజ్ లో ఉన్న శివాజీ గారు అసలైన శివాజీ. కానీ ఆయనపై ఎప్పటికీ గౌరవం ఉంటుంది ‘ అంటూ చెప్పుకొచ్చారు కౌశల్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ విన్నర్ శివాజీ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. మరి దీనిపై శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.
కౌశల్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




