Shocking Video: విమాన ప్రమాదం భయానక దృశ్యాలు..! 2 సెకన్లలో మొత్తం బూడిద.. వీడియో వైరల్

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఇక్కడ ఓ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Shocking Video: విమాన ప్రమాదం భయానక దృశ్యాలు..! 2 సెకన్లలో మొత్తం బూడిద.. వీడియో వైరల్
Plane Crash
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2022 | 10:42 AM

నిత్యం లక్షలాది వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు చాలా మంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతారు. కొన్నిసార్లు ప్రజలు తృటిలో ప్రాణాలతో బయటపడుతుంటారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఇక్కడ ఓ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూస్తుంటేనే ఒళ్లు గగ్గరుపాటుకు గురవుతుంది.

విమానం ఏదో సాంకేతిక కారణాల వల్ల ఎలా కిందకు పడిపోతుందో ఈ వీడియోలో చూడవచ్చు. విమానం భూమికి కొంచెం ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే పైలట్ తన సీటును బయటకు తీసి పారాచూట్ సహాయంతో గాలిలోకి ఎగురతాడు. ఈ సమయంలో పైలట్ విమానం నుండి బయటకు వచ్చిన వెంటనే విమానం కేవలం రెండు సెకన్ల వ్యవస్ధిలోనే విమానం నేలమీద పడిపోతుంది. బలంగా భూమిని ఢీకొనడంతో పెద్ద పేలుడు సంభవించింది. విమానం పూర్తిగా తునాతునకలైంది. ఈ పేలుడు చాలా భయంకరంగా ఉంది, మంటలు చాలా ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో, పైలట్ సమయస్పూర్తిగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దుర్ఘటన ఎంత ప్రమాదకరంగా ఉందంటే..వీడియో చూసిన నెటిజన్లకు ఒక్క క్షణం గుండె ఆగిపోయింనతపనైంది. అతడు అదృష్టవంతుడు. సకాలంలో విమానం నుండి బయటికి రాగలిగాడు..లేదంటే, 2 సెకన్ల ఆలస్యమైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో @LookedExpensive అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. కేవలం 9 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షలకు పైగా వీక్షించగా, వేలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. కొందరు ఈ ప్రమాదాన్ని భయంకరమైనదిగా అభివర్ణించగా, మరికొందరు పైలట్ అదృష్టవంతుడంటూ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి