27 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టని ఏకైక ఎంప్లాయ్‌.. ! 62 లక్షల గిఫ్ట్ పట్టేశాడు

సెలవులు అవసరమైన సమయంలో కొందరు ఉద్యోగులు.. తమ బాస్‌కు వివిధ కారణాలు చెప్పి, ఎలాగోలా ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు ఉద్యోగులు తమ సమస్యను నిజాయితీగా చెప్పి.. సెలవులు తీసకుంటూ ఉంటారు.

27 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టని ఏకైక ఎంప్లాయ్‌.. ! 62 లక్షల గిఫ్ట్ పట్టేశాడు
Burger King Employee
Jyothi Gadda

|

Jun 26, 2022 | 9:39 AM

ఒక్క రోజు సెలవు కోసం ఉద్యోగులు నానా తంటాలు పడాల్సి ఉంటుంది. సెలవులు అవసరమైన సమయంలో కొందరు ఉద్యోగులు.. తమ బాస్‌కు వివిధ కారణాలు చెప్పి, ఎలాగోలా ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు ఉద్యోగులు తమ సమస్యను నిజాయితీగా చెప్పి.. సెలవులు తీసకుంటూ ఉంటారు. అలాంటి వారి మాటలు బాస్‌లు ఎలాగూ నమ్మరనుకోండి..అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉద్యోగి మాత్రం ఎంతో వెరీ స్పెషల్‌..అతనికి ఉద్యోగం చేస్తున్నంతకాలం ఒక్క సెలవు కూడా అవసరం రాలేదట. ఈ లెక్కన తాను ఉద్యోగం చేసినన్ని రోజులు ఒక్క సెలవు కూడా పెట్టనేలేదట. అందుకు గానూ అతన్ని భారీ నజరానాతో సత్కారం లభించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని బర్గర్ కింగ్ సంస్థలో పనిచేస్తున్న కెవిన్ ఫోర్డ్ అలాంటి వాళ్లకు పెద్ద బ్రో. 60 ఏళ్ల కెవిన్ గత 27 సంవత్సరాల్లో ఒక్కంటంటే ఒక్క సెలవు కూడా పెట్టకుండా పనిచేస్తున్నాడు. అంతేకాదు, కస్టమస్టర్లకు సర్వీసులో ఏ లేపమూ రానివ్వడం లేదు. అతని అంకింతభావానికి కస్టమర్లు ఫిదా అయ్యారు. అతనికేదైనా సాయం చేయాలని గోఫండ్‌మి వేదికపై విరాళాలు సేకరిస్తున్నారు.

ఇప్పటివరకు రూ. 62 లక్షల రూపాయలు వచ్చాయి. తన అంతికభావాన్ని గుర్తిస్త బర్గర్ సంస్థ సినిమా టికెట్లు, పెన్నులు, మంచి బ్యాగు ఇచ్చిందటూ కెవిన్ ఓ వీడియో పోస్ట్ చేయడంతో అతని గురించి తొలిసారి బయటకి తెలిసింది. అందరూ అతనికి చేతనైనంత సాయం చేస్తున్నారు. హాలీవుడ్ నటుడు డేవిడ్ స్పేడ్ తొలుత 5వేల డాలర్లు ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu