దుర్గమ్మ ఆలయ అధికారుల కీలక నిర్ణయం..టీటీడీ బాటలోనే ఇంద్రకీలాద్రి

విజయవాడ ఇంద్రాకీలాద్రి దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడ ఒకటి. రోజూ వందల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.

దుర్గమ్మ ఆలయ అధికారుల కీలక నిర్ణయం..టీటీడీ బాటలోనే ఇంద్రకీలాద్రి
Durga Gudi
Jyothi Gadda

|

Jun 25, 2022 | 9:54 PM

విజయవాడ ఇంద్రాకీలాద్రి దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడ ఒకటి. రోజూ వందల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. పండుగలు, పర్వదినాల్లో భక్తుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుమల తరహాలోనే ఇంద్రకీలాద్రిని కూడా ‘‘టొబాకో ఫ్రీ జోన్‌’’గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన డిక్లరేషన్‌పై కలెక్టర్ ఢిల్లీ రావు, ఆలయ ఈవో, డీఎంహెచ్‌వో సంతకాలు చేశారు. భక్తులు, ఆలయ సిబ్బంది కచ్చితంగా ఈ నిబంధన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్ప‌టికే తిరుమ‌ల ఆల‌యాన్ని టొబాకో ఫ్రీ జోన్‌గా ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా విజ‌య‌వాడ‌లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌య ప‌రిస‌రాల‌ను కూడా పొగాకు నిషేధిత ప్రాంతంగా ప్ర‌క‌టించింది. ఈ నిబంధ‌న‌లు జూన్‌ 26 నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లు ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఢిల్లీరావు శ‌నివారం ఆల‌య ప‌రిస‌రాల్లోనే వెల్లడించారు.ఈ నిషేధం ప్ర‌కారం ఆల‌య మెట్ల మార్గం నుంచి కొండ పై భాగం వ‌ర‌కు పొగాకు ఉత్ప‌త్తుల వినియోగంతో పాటు విక్ర‌యాలు ర‌ద్దు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

అధికారుల ఈ నిషేధాజ్ఞ‌లు ఉల్లంఘించే వారిపై కనిష్ఠంగా రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.200 వ‌ర‌కు జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆల‌య అధికారులు, సిబ్బందితో పాటు ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు కూడా దీనిపై అవ‌గాహ‌న కల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొ్న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu