Chandrababu House Tension : చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు.. మూడేళ్ల క్రితం ఘటనతో..
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వంలో కరకట్ట సమీపంలో ఏర్పాటు చేసిన
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వంలో కరకట్ట సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కూల్చివేత నేటికి మూడేళ్లు పూర్తైంది. కూల్చివేతను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ప్రజావేదిక ముట్టడికి పిలుపునిచ్చారు. అలర్టైన పోలీసులు టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రజావేదిక దగ్గరకు వెళ్ళేందుకు టీడీపీ శ్రేణుల సర్వ ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. ప్రజావేదిక ముట్టడికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటివైపు వెళ్లే దారులను మూసివేశారు. చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు, TNSF కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
ప్రజావేదిక కూల్చివేత మూడేళ్లు పూర్తైన క్రమంలో సీఎం జగన్ ను ట్విట్టర్ వేదికగా విమర్శించారు చంద్రబాబు. డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ చేతగాని జగన్.. ఈ మూడేళ్లలో చేసినవన్నీ కూల్చివేతలేనంటూ ఫైర్ అయ్యారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించిన జగన్… మూడేళ్ల పాలనలో కట్టింది శూన్యమంటూ విమర్శించారు చంద్రబాబు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో ఈ వివాదం రాజుకుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి