Cotton Plant : ప‌త్తిచెట్టుతో ఆరోగ్య ప్రయోజనాలు.. స్త్రీలు, పురుషుల‌కు బాగా ప‌నిచేస్తుంది..! తెలిస్తే విడిచిపెట్టరు..

దీనిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి స‌గం గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి దానికి త‌గినంత కండ‌చ‌క్కెర‌ను క‌లిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉండ‌డం వ‌ల్ల

Cotton Plant : ప‌త్తిచెట్టుతో ఆరోగ్య ప్రయోజనాలు.. స్త్రీలు, పురుషుల‌కు బాగా ప‌నిచేస్తుంది..! తెలిస్తే విడిచిపెట్టరు..
Cotton Plant
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 25, 2022 | 8:37 PM

Cotton Plant : ఇత‌ర చెట్ల లాగా ప‌త్తి చెట్టు కూడా అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుందని మీకు తెలుసా..? ప‌త్తి చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

– ప‌త్తి ఆకులను నూరి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని గ‌వద బిళ్ల‌ల‌పై లేప‌నంగా రాస్తూ ఉండ‌డం వ‌ల్ల క్ర‌మంగా గ‌వ‌ద బిళ్ల‌లు తగ్గుతాయి.

– ప‌త్తి వేరును పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి స‌గం గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించి దానికి త‌గినంత కండ‌చ‌క్కెర‌ను క‌లిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉండ‌డం వ‌ల్ల మూత్రంలో మంట త‌గ్గుతుంది.

ఇవి కూడా చదవండి

– ప‌త్తి ఆకును మెత్త‌గా నూరి లేదా ప‌త్తిని కాల్చి ఆ బూడిద‌ను పైన లేప‌నంగా రాస్తూ ఉండ‌డం వ‌ల్ల గాయాలు త‌గ్గుతాయి.

– పామిడి ప‌త్తి ఆకుల‌కు, దోర‌గా వేయించి న మిరియాల‌ను క‌లిపి నూరి ఆ మిశ్ర‌మాన్ని గ‌జ్జ‌ల‌లో వ‌చ్చే బిళ్ల‌ల‌పై ఉంచి అది ఊడిపోకుండా క‌ట్టు క‌ట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా గజ్జ‌ల‌లో వ‌చ్చిన బిళ్ల‌లు త‌గ్గిపోతాయి.

– 10 గ్రాముల ప‌త్తి పువ్వుల‌ను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా న‌లిపి వ‌డ‌క‌ట్టి త‌గినంత కండ చ‌క్కెర‌ను క‌లిపి ఆ నీటిని రెండు భాగాలుగా చేసి రెండు పూట‌లా తాగిస్తే.. పిచ్చి చేష్ట‌లు త‌గ్గి మామూలు స్థితికి వ‌స్తారు.

– పామిడి ప‌త్తి గింజ‌ల‌ను చిన్న మంట‌పై వేయించి దంచి జ‌ల్లించి ఆ పొడిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడితో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల దంతాల నొప్పులు త‌గ్గుతాయి.

– ప‌త్తిచెట్టు బెర‌డును, శొంఠి పొడితో క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్న లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల వృష‌ణాల వాపు త‌గ్గుతుంది. పెస‌ర‌ప‌ప్పు, పాలు, చ‌క్కెర‌ల‌ను క‌లిపి పాయ‌సాన్ని చేయాలి. ఈ పాయ‌సం ఉడికేట‌ప్పుడు అందులో 3 గ్రాముల ప‌త్తి పువ్వుల పొడిని వేసి ఉడికించి ఆ పాయ‌సాన్ని తిన‌డం వ‌ల్ల పురుషుల‌లో వీర్య బ‌ల‌హీన‌త త‌గ్గుతుంది.

– బ‌హిష్టు ఆగిన స్త్రీలు 20 గ్రాముల ప‌మిడి ప‌త్తికాయ‌ల‌ను తీసుకుని దంచి అర లీట‌ర్ నీటిలో వేసి స‌గం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి దానికి 20 గ్రాముల పాత బెల్లాన్ని క‌లిపి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగిన గంట వ‌ర‌కు ఏమీ తిన‌కుండా ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో ఆగిన బ‌హిష్టు మ‌ర‌లా వ‌స్తుంది. బ‌హిష్టు ప్రారంభం కాగానే ఆ క‌షాయాన్ని తాగ‌డం ఆపి వేయాలి.

– పామిడి చెట్టు గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని రోజూ రాత్రి ప‌డుకునే ముందు నొప్పులు, వాపులు ఉన్న చోట ఉంచి క‌ట్టు కట్టి ఉద‌యాన్నే తీసివేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా వాపులు, నొప్పులు త‌గ్గుతాయి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి