AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cranberry Juice Benefits: అంతగా ప్రజాదరణ పొందని ఈ జ్యూస్.. యూరినరీ ఇన్ఫెక్షన్ సహా అనేక వ్యాధులకు చక్కటి పరిష్కారం..

క్రాన్‌బెర్రీ జ్యూస్ ఇతర జ్యూస్‌ల వలె ప్రజాదరణ పొందలేదు. అయితే ఈ రుచికరమైన జ్యూస్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Cranberry Juice Benefits: అంతగా ప్రజాదరణ పొందని ఈ జ్యూస్.. యూరినరీ ఇన్ఫెక్షన్ సహా అనేక వ్యాధులకు చక్కటి పరిష్కారం..
Cranberry Juice
Surya Kala
|

Updated on: Jun 25, 2022 | 9:55 PM

Share

Cranberry Juice Benefits: క్రాన్‌బెర్రీని గూస్‌బెర్రీ అని కూడా అంటారు. క్రాన్‌బెర్రీస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. మీరు జ్యూస్ రూపంలో కూడా క్రాన్బెర్రీస్ తినవచ్చు.  అయితే క్రాన్‌బెర్రీ జ్యూస్ ఇతర జ్యూస్‌ల వలె ప్రజాదరణ పొందలేదు. అయితే ఈ రుచికరమైన జ్యూస్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు కొందరు దీనిని తాగుతుంటారు. ఈ రసంలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని రసం చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. క్రాన్‌బెర్రీస్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

  1. క్రాన్‌బెర్రీ జ్యూస్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది: క్రాన్ బెర్రీ జ్యూస్ లో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలడం, ఇతర జుట్టు సంబంధిత సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఈ రెండు ముఖ్యమైన పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది జుట్టును మెరిసేలా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
  2. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: క్రాన్‌బెర్రీస్‌లో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. అవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ ఫైటోన్యూట్రియెంట్లు గుండె మంట నుండి రక్షించడానికి, గుండె జబ్బుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. క్రాన్‌బెర్రీలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
  3. పిసిఒఎస్‌తో బాధపడుతున్న మహిళలకు మేలు చేస్తుంది: క్రాన్బెర్రీ జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. PCOSతో బాధపడుతున్న మహిళలకు మేలు చేస్తుంది.
  4. నిద్ర లేమి సమస్యకు చెక్ పెడుతుంది: క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో మెలటోనిన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. మెలటోనిన్‌ని స్లీప్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. మంచి నిద్ర కోసం మీరు నిద్రపోయే ముందు క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: మీరు క్రమం తప్పకుండా క్రాన్‌బెర్రీ జ్యూస్‌ తీసుకోవచ్చు. క్రాన్‌బెర్రీ జ్యూస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను నివారిస్తుంది. ఒక నివేదిక ప్రకారం.. క్రమం తప్పకుండా క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల UTI ప్రమాదం 30% వరకూ తగ్గినట్లు తెలుస్తోంది.
  7. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: క్రాన్‌బెర్రీ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  వృద్ధాప్యపు లక్షణాలను నివారిస్తుంది.
  8. ఆకలిని అదుపులో ఉంచుతుంది: క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో విటమిన్ సి ఉంటుంది.  ఈ జ్యూస్‌ తాగడం వలన పొట్ట నిండుగా ఉంటుంది. దీంతో అతిగా తినకుండా చేస్తుంది.

మరిన్ని హెల్త్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. మీరు ఎలాంటి పద్ధతులు పాటించాలన్నా వైద్యులు, నిపుణులను సంప్రదించాలి. పైన పేర్కొన్న ఏదైనా వస్తువులను తీసుకునే ముందు, మీ శరీరానికి సంబంధించిన వైద్య సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది)