Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avaram Senna Flower: ప్రకృతి ప్రసాదం తంగేడు పువ్వులు.. షుగర్, అతిమూత్రం వంటి అనేక సమస్యలకు చక్కటి ఔషధం..

బంగారు రంగులో గుత్తులుగా, కొమ్మల చివర పెరిగే ఈ తంగేడు పువ్వులు.. తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి. అయితే ఈ మొక్క మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్యల‌ను తగ్గించ‌డంలో మంచి సహాయకారి అని చాలా మందికి తెలియ‌దు. ఆయుర్వేదంలో మధుర, రూక్ష, పిత్త, వాత కఫ హర గుణాలున్నట్టు పేర్కొన్నారు.

Avaram Senna Flower: ప్రకృతి ప్రసాదం తంగేడు పువ్వులు.. షుగర్, అతిమూత్రం వంటి అనేక సమస్యలకు చక్కటి ఔషధం..
Avaram Senna Flower Benefit
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2022 | 6:02 PM

Avaram Senna Flower Benefits: తెలంగాణలోని(Telangana) ప్రముఖ పండగ బతుకమ్మని(Batukamma) పేర్చడానికి ఉపయోగించే పువ్వుల్లో ఒకటి తంగేడు పువ్వు.  ఆ మొక్కలోని ఔషధ(Medicinal Plant) ప్రాముఖ్యం తెలియజేయడానికే మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది. ఈ తంగేడు మొక్క ఒక దివ్య ఔషధ మొక్క. బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువ పెరిగే ఈ మొక్క చాలా అందమైన పువ్వులు పూస్తుంది.  బంగారు రంగులో గుత్తులుగా, కొమ్మల చివర పెరిగే ఈ తంగేడు పువ్వులు.. తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి. అయితే ఈ మొక్క మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్యల‌ను తగ్గించ‌డంలో మంచి సహాయకారి అని చాలా మందికి తెలియ‌దు. ఆయుర్వేదంలో మధుర, రూక్ష, పిత్త, వాత కఫ హర గుణాలున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు తంగేడు పువ్వుల ఏయే రోగాలను నయం చేస్తుందో తెలుసుకుందాం..

  1. తంగేడు పువ్వులు షుగ‌ర్ వ్యాధికి దివ్య ఔష‌ధంగా ప‌ని చేస్తాయి. గుప్పెడు తంగేడు పువ్వుల‌ను తీసుకుని మిన‌ప ప‌ప్పుతో లేదా పెస‌ర ప‌ప్పుతో కూర చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్రణ‌లోకి వ‌స్తుంది.
  2. బలహీనంగా ఉన్నా.. తరచుగా అలసటకు గురవుతున్నా.. తంగేడు పువ్వులు మంచి సహాయకారి.
  3. ముఖ్యంగా పురుషుల్లో స్వప్న స్కల‌న సమస్య ఉంటె.. తంగేడు పువ్వులు మంచి సహాయకారని నిపుణులు చెబుతున్నారు. తంగేడు పువ్వు రెక్కల‌ను, చ‌క్కెర‌ను ఆవు పాల‌లో వేసి బాగా మ‌రిగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ చొప్పున రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో స్వప్న స్కల‌న స‌మ‌స్య త‌గ్గుతుంది.
  4. అతి మూత్ర వ్యాధి సమస్యతో ఇబ్బంది పడేవారు.. ఈ పువ్వుల రెక్కల‌ను నీడలో ఎండ‌బెట్టి పొడిలా చేసుకోవాలి. ఈ పొడికి చ‌క్కెర‌ను లేదా తేనెను క‌లిపి ప్రతిరోజూ అర టీ స్పూన్ చొప్పున తీసుకోవ‌డం వ‌ల్ల అతి మూత్ర వ్యాధి న‌యం అవుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. అరికాళ్లలో మంట‌ల‌ను, నీరసం, గుండె ద‌డ‌ను త‌గ్గించడంలోనూ ఈ చెట్టు పువ్వులు మంచి ఔషధం.
  7. తంగేడు పువ్వుల రెక్కలు 100 గ్రా., ధ‌నియాల పొడి 50 గ్రా., యాల‌కుల పొడి 20గ్రా., శొంఠి పొడి 20 గ్రా. చొప్పున క‌లిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాగిజావ వంటి ఆహారంలో కలుపుకుని తీసుకోవడం వలన మంచి ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.
  8. చారు, ర‌సం, సాంబార్ వంటి వాటిని త‌యారు చేసేట‌ప్పుడు ఈ పూల రెక్కల‌ను లేదా పువ్వుల పొడిని చేర్చుకోవడం వలన కూడా అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.
  9. శ‌రీరానికి చ‌లువ చేసే గుణం కూడా తంగేడు పువ్వుల‌కు ఉంది.  తంగేడు పువ్వులకు చ‌ర్మం కాంతివంతంగా చేసే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు.
  10. కనుక సీజన్ లో లభించే ఈ తంగేడు పువ్వులను సేక‌రించి నీడలో ఎండ‌బెట్టి నిల్వ చేసి సంవ‌త్సర‌మంతా వాడుకోవ‌చ్చని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. మీరు ఎలాంటి పద్ధతులు పాటించాలన్నా వైద్యులు, నిపుణులను సంప్రదించాలి. పైన పేర్కొన్న ఏదైనా వస్తువులను తీసుకునే ముందు, మీ శరీరానికి సంబంధించిన ఆయుర్వేద వైద్య సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.