Monsoon Diet: వర్షాకాలంలో ఈ ఐదు రకాల ఫుడ్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి.. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..

Monsoon Diet: పసుపు, వెల్లుల్లి, పాలకూర, కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ వర్షాకాలంలో తినే ఆహారంలో డైట్‌లో చేర్చుకోవాలి. ఈ 5 ఆహార పదార్ధాలు ఈ సీజన్‌లో, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, ఇన్‌ఫెక్షన్‌లు సహా ఆనేక ఇతర అనారోగ్యాల సమస్యను నివారిస్తాయి.

Monsoon Diet: వర్షాకాలంలో ఈ ఐదు రకాల ఫుడ్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి.. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..
Monsoon Diet
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2022 | 4:35 PM

Monsoon Diet: వేసవి తాపం(Summer Season) నుంచి ఉపశమనం ఇస్తూ.. వర్షాకాలం (rainy season) మొదలైంది. ఇప్పటికే రుతుపవనాలు పలు ప్రాంతాల్లో అడుగు పెట్టాయి. తొలకరి జల్లులతో ప్రశాంతత ఇచ్చే సీజనల్ మొదలైంది. అయితే వర్షాకాలం పలు ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది. ఈ సీజన్‌లో ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, ఇన్‌ఫెక్షన్‌లు, ఫ్లూ , జలుబు, దగ్గు వంటి వ్యాధుల సహా.. అనేక రకరకాల ఆరోగ్య సమస్యలకు మనం లోనయ్యే అవకాశం ఉంది. కనుక ఈ సీజన్ లో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచే ఆహారపదార్ధాలను తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఈ వర్షాకాలంలో డైట్‌లో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

  1. పసుపు: పసుపు ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రోజూ నిద్రపోయే సమయంలో పాలల్లో పసుపు వేసుకుని తాగడం వర్షాకాలంలో మంచిది. సాధారణ వంటల్లో పసుపు పొడిని ఉపయోగించాలి. లేదా తురిమిన అల్లం, పసుపును కూడా ఆహారపదార్ధాల్లో చేర్చుకోవాలి. పసుపు వర్షాకాలంలోనే కాకుండా అన్ని సీజన్‌లలో ఉపయోగకరం.
  2. నిమ్మకాయ: నిమ్మకాయలో విటమిన్ సి సహజంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాకి విటమిన్ సి అత్యవసరం. ఇది ఆరోగ్యంతో పాటు.. అనేక ఇతర ప్రయోజనాలు ఇస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలను బలపరుస్తుంది.
  3. వెల్లుల్లి: వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. జలుబు , ఫ్లూకి కారణమయ్యే సూక్ష్మక్రిములతో పోరాడుతున్నప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో  కణాల పరిమాణాన్ని పెంచుతుంది, తద్వారా సాధారణ జలుబు, ఫ్లూ వంటి వైరల్ వ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది.
  4. డ్రై ఫ్రూట్స్:  ఖర్జూరం, బాదం , వాల్‌నట్‌లను అల్పాహారంగా తీసుకోవడం మంచిది. వీటిల్లో అధిక విటమిన్ , మినరల్ కంటెంట్ ఉంటాయి. కనుక ఈ డ్రైఫ్రూట్స్  గింజలు వర్షాకాలం సీజన్ లో అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. పాలకూర: ఈ ఆకు కూరలో ఫైబర్, విటమిన్లు A, E , C  అధికంగా ఉంటాయి. ఈ విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ మీ శరీరానికి సరిగ్గా పని చేయడానికి, మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. అంతేకాదు  వర్షాకాలంలో శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అయితే వర్షాకాలంలో బురద, ధూళి కారణంగా  ఆకు కూరలు తినకూడదని సలహా ఇస్తారు. అందుకనే వర్షాకాలంలో ఆకు కూరలు వండుకునే సమయంలో మరింత జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. వంట చేసే ముందు ఆకు కూరలను పూర్తిగా నీటిలో కడగాలి.

సీజన్ లో అనారోగ్యం ఉందని అనిపిస్తే… వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. మీరు ఎలాంటి పద్ధతులు పాటించాలన్నా వైద్యులు, నిపుణులను సంప్రదించాలి. పైన పేర్కొన్న ఏదైనా వస్తువులను తీసుకునే ముందు, మీ శరీరానికి సంబంధించిన అలెర్జీల కోసం పరీక్షించాల్సి ఉంటుంది.