Baldder Stones: వామ్మో.. ఓ వ్యక్తి బ్లాడర్‌లో అర కిలో రాళ్లు.. చూసి అవాక్కయిన వైద్యులు.. చివరకు ఏం చేశారంటే..?
మధ్యప్రదేశ్‌లోని మోరెనాకు చెందిన 29 ఏళ్ల దీపక్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి టెర్రస్ పైనుంచి పడిపోయాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో అతని వెన్నెముకకు గాయమైంది.
Stones In Bladder: దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియన్ స్పైనల్ ఇన్‌జ్యురి సెంటర్ (ISIC) వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ యువకుడి మూత్రాశయంలో ఉన్న అర కిలో రాళ్లను తొలగించారు. ఆ వ్యక్తి బ్లాడర్‌లో మొత్తం 16 రాళ్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీ ఎస్‌ఐసీ హాస్పిటల్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని మోరెనాకు చెందిన 29 ఏళ్ల దీపక్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి టెర్రస్ పైనుంచి పడిపోయాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో అతని వెన్నెముకకు గాయమైంది. వెన్నులోని D12కు కంప్రెషన్ ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు డాక్టర్లు. అతను ఢిల్లీలోని స్పైనల్ ఇన్‌జ్యురి సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదే సమయంలో అతనికి మూత్రాశయ సమస్య కూడా ఉన్నట్టు బయటపడింది. దాంతో డాక్టర్లు CT స్కాన్, ఎక్స్‌రే తీయించారు. ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్లు అవాక్కయ్యారు.
దీపక్ బ్లాడర్‌లో చిన్న సైజ్ రాళ్ల గుట్ట కనిపించింది. అక్కడ సైలెంట్‌గా పెరిగిపోతున్న రాళ్లను ఇన్నాళ్లూ అతను ఎలా తట్టుకున్నాడా అని ఆశ్చర్యపోయామని వైద్యులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు అతనికి కిడ్నీలో రాళ్లు లేవు. దాంతో బ్లాడర్‌లో ఉన్న రాళ్లను తొలగించడానికి సిద్ధమయ్యారు డాక్టర్లు. ఓపెన్ సిస్టోలితాటమీ ప్రొసీజర్ ద్వారా ఒకేసారి అన్ని రాళ్లను తొలగించాలని నిర్ణయించారు. ఈ అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ISICకి చెందిన డాక్టర్ ప్రశాంత్ జైన్ తెలిపారు.
సాధారణంగా వెన్నెముకకు గాయమై నడవలేని వ్యక్తుల్లో బ్లాడర్ సమస్యలు వస్తుంటాయని డాక్టర్ ప్రశాంత్ జైన్ చెప్పారు. బ్లాడర్ సహజంగా పనిచేయడానికి అడ్డంకుల వల్ల ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంటుందని, అయితే సైజులో పెద్దవే అయిన 16 రాళ్లు పేరుకుపోవడం ఆశ్చర్యమేనని తెలిపారు. అదృష్టవశాత్తూ రోగి కిడ్నీలో రాళ్లు లేవని, అతని కిడ్నీ కూడా బాగుందని డాక్టర్ చెప్పారు. ఓపెన్ సిస్టోలిథోటమీ విధానం ద్వారా రాళ్లను ఒకేసారి తొలగించామని.. ప్రస్తుతం.. దీపక్ కోలుకుంటున్నాడని పేర్కొన్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..