AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: మహా సంక్షోభంలో కీలక మలుపు.. బీజేపీ అగ్రనేతలతో ఏక్నాథ్ షిండే భేటీ..

రాజకీయ సంక్షోభం ఆరోరోజు ఏక్నాథ్ షిండే నిన్న అర్ధరాత్రి (జూన్ 24, శుక్రవారం) గుజరాత్‌లోని వడోదరలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. రాజకీయ సమీకరణలపై ఇద్దరు నేతలు చర్చినట్లు తెలుస్తోంది.

Maharashtra Political Crisis: మహా సంక్షోభంలో కీలక మలుపు.. బీజేపీ అగ్రనేతలతో ఏక్నాథ్ షిండే భేటీ..
Eknath Shinde, Devendra Fad
Shaik Madar Saheb
|

Updated on: Jun 25, 2022 | 11:19 PM

Share

Eknath shinde met devendra fadnavis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ముందునుంచి ఏ జాతీయ పార్టీతో సంబంధం లేదని చెబుతూనే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే బీజేపీ అగ్రనేతలతో భేటీ కావడం మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ సంక్షోభం ఆరోరోజు ఏక్నాథ్ షిండే నిన్న అర్ధరాత్రి (జూన్ 24, శుక్రవారం) గుజరాత్‌లోని వడోదరలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. రాజకీయ సమీకరణలపై ఇద్దరు నేతలు చర్చినట్లు తెలుస్తోంది. ముంబై నుంచి ఇండోర్ మీదుగా ఫడ్నవీస్ వడోదర చేరుకోగా.. గౌహతి నుంచి షిండే వడోదర చేరుకున్నారు. ఇద్దరి మధ్య అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో చర్చలు జరిగాయి. అయితే.. యాదృశ్చికంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం వడోదరలో ఉండటంతో రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. అయితే.. అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించినట్లు సమాచారం. అనంతరం ఫడ్నవీస్ ముంబై చేరుకున్నారు. ఇప్పుడు బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఏక్నాథ్ షిండే గౌహతి నుంచి గుజరాత్ చేరుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా గుజరాత్ చేరుకున్నారు.

ఇదిలా ఉంటే.. నిన్న అమిత్ షా కూడా వడోదరలో ఉన్నారని.. అయితే ఫడ్నవీస్‌, షిండేల భేటీకి హాజరవ్వడంపై క్లారిటీ లేదు. ఏక్‌నాథ్‌ షిండే రాత్రిపూట చార్టర్డ్‌ విమానంలో గుజరాత్‌లోని వడోదరకు వెళ్లి అర్థరాత్రి తర్వాత తెల్లవారుజామున హోటల్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 16 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్, ప్రత్యేక పార్టీ ఏర్పాటు నిర్ణయం తదితర అంశాలపై దేవేంద్ర ఫడ్నవీస్‌తో షిండే చర్చించారు. కాగా, ఏక్‌నాథ్ షిండే నిన్న మధ్యాహ్నం లాయర్లను రెండు గంటల పాటు కలిసేందుకు హోటల్ నుంచి బయటకు వెళ్లారు. అయితే.. మొదటి నుంచి ఎంవీఏ కూటమిని వ్యతిరేకిస్తున్న ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలుపుతారా..? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా..? అనేది వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

అంతకుముందు ట్విట్ చేసిన.. ఎక్నాథ్ షిండే.. మహావికాస్ అఘాడీ కోరల్లో చిక్కుకున్న శివసేనకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నానంటూ పేర్కొన్నారు. శివసేన కార్యకర్తలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ పోరాటం పార్టీ కార్యాకర్తల అభ్యున్నతి కోసమే అంటూ శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే పేర్కొ్నారు. అధికారంలో ఉన్న మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ఎందుకు ఎంచుకున్నానో అర్ధం చేసుకోవాలంటూ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..