ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఇంట్లో ఓ వైపు విజిలెన్స్‌ దాడులు.. మరోవైపు కాల్పుల్లో కొడుకు మృతి..! హత్యా..? ఆత్మహత్యా..?

IAS అధికారి సంజయ్‌ పోప్లీ కుమారుడు కార్తీక్‌ తుపాకీ కాల్పుల్లో చనిపోయాడు. తనను తాను కాల్చుకుని చనిపోయాడా.. ఎవరైనా కాల్చారా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఘటన జరిగిన టైమ్‌లో పోప్లీ నివాసంలో విజిలెన్స్ రైడ్స్ జరుగుతున్నాయి.

ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఇంట్లో ఓ వైపు విజిలెన్స్‌ దాడులు.. మరోవైపు కాల్పుల్లో కొడుకు మృతి..! హత్యా..? ఆత్మహత్యా..?
Arrested Ias Officer
Jyothi Gadda

|

Jun 25, 2022 | 7:55 PM

చండీఘడ్‌లో ఓ ఘటన సంచలనం రేపుతోంది. IAS అధికారి సంజయ్‌ పోప్లీ కుమారుడు కార్తీక్‌ తుపాకీ కాల్పుల్లో చనిపోయాడు. తనను తాను కాల్చుకుని చనిపోయాడా.. ఎవరైనా కాల్చారా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఘటన జరిగిన టైమ్‌లో పోప్లీ నివాసంలో విజిలెన్స్ రైడ్స్ జరుగుతున్నాయి. ఓవైపు ఆ సోదాలు జరుగుతుండగా సంజయ్ కుమారుడు చనిపోయాడు. తనను తాను కాల్చుకుని చనిపోయాడని విజిలెన్స్‌ అధికారులు చెబుతుంటే, కాదు.. విజిలెన్స్ అధికారులే కాల్చిచంపారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సంజయ్‌ నివాసంలో జరిగిన ఐటీ రైడ్స్‌లో 12 కిలోల బంగారం, 3కిలోల వెంట దొరికాయి. నాలుగు సెల్‌ఫోన్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించగా..

అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఐఏఎస్ అధికారి సంజయ్ పొప్లీని జూన్ 21న పంజాబ్ విజిలెన్స్ అరెస్టు చేసింది. మురుగునీటి పైప్‌లైన్ వేయడానికి టెండర్లను క్లియర్ చేయడానికి బదులుగా లంచం డిమాండ్ చేసినందుకు అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసినట్టు తెలిసింది. విజిలెన్స్ అధికారుల బృందం విచారణ నిమిత్తం చండీగఢ్‌లోని ఆయన ఇంటికి వెళ్లింది. ఈ సమయంలోనే కాల్పుల శబ్దం వినిపించిందని.. కార్తిక్ తనను తాను కాల్చుకొని చనిపోయాడని అధికారులు చెబుతున్నారు. లైసెన్స్డ్ షాట్గన్తో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీన్ని సంజయ్ పొప్లి భార్య ఖండించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘విజిలెన్స్ అధికారులు మాపై ఒత్తిడి చేస్తున్నారు. వారు నమోదు చేసిన కేసుకు మద్దతుగా తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని నా ఇంటి పనిమనిషిని కూడా హింసించారు. నా 27 ఏంకొడుకు చనిపోయాడు. అతను తెలివైన న్యాయవాది. నాకు న్యాయం కావాలి. నేను కోర్టును ఆశ్రయిస్తాను. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దీనికి సమాధానం చెప్పాలి` అని ఏడుస్తూ చెప్పింది. తన భర్త సంజయ్‌ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని ఆ సమయంలో విజిలెన్స్‌ బృందం తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. కార్తిక్‌ను పైకి తీసుకెళ్లారు. నేను పైకి వెళ్లి చూశా.. కార్తిక్‌ను మానసికంగా హింసించడం కనిపించిందన్నారు. ఆరోపణలను ఒప్పుకోవాలని హింసించారు… మా ఫోన్లనూ లాగేసుకున్నారు… నా కుమారుడిని గంటలపాటు బంధించారు. ఇప్పుడు కార్తిక్ చనిపోయాడు. సాక్ష్యాలు దొరకకపోతే వీరు ఎవరినైనా చంపేస్తారు.. అని ఆమె ఆరోపించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu