వారెవ్వా… బైకు దొంగల మజాకా..! కన్నుపడితే నిమిషాల్లో బైక్‌ మాయం.. వారి అస్త్రమేంటో తెలిస్తే అవాక్కే!!

ఈనెల 20న నాతవరం నుంచి పాయకరావుపేటలో బంధువుల ఇంటికి వచ్చిన వ్యక్తి.. బైక్ చోరీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పాయకరావుపేట పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కూపీ లాగి వాహనాల తనిఖీలు ప్రారంభించారు.

వారెవ్వా... బైకు దొంగల మజాకా..! కన్నుపడితే నిమిషాల్లో బైక్‌ మాయం.. వారి అస్త్రమేంటో తెలిస్తే అవాక్కే!!
Bike Gang Arrested
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 25, 2022 | 5:43 PM

 మీరు బుల్లెట్ తాళం వేసి పార్క్ చేస్తున్నారా..? పోనీ హ్యాండిల్ లాక్ చేసి మీ బైక్ ను వదిలి వెళ్తున్నారా..? బైక్ కు ఉన్న లాక్ తో సేఫ్ గా ఉంటుందని భావిస్తున్నారా..? అయితే మీలాంటి వారి కోసమే ఈ న్యూస్. చిన్న పిన్నీసు సాయంతో.. పది నిమిషాల్లో మీ బైక్ మాయ చేసే కేటుగాళ్లు ఉన్నారంటే నమ్మశక్యంగా ఉండదు. అనకాపల్లి జిల్లాలో జరిగిన చోరీ కేసులో పట్టుబడ్డ ఇద్దరు నిందితులు.. వాళ్లు చోరీ చేసిన వ్యవహారాన్ని చెప్పడంతో పోలీసులే అవాక్కయ్యారు.

అనకాపల్లి జిల్లా లో కొంతకాలంగా తరచూ టూవీలర్లు మాయం అవుతున్నాయి. ఈనెల 20న నాతవరం నుంచి పాయకరావుపేటలో బంధువుల ఇంటికి వచ్చిన వ్యక్తి.. బైక్ చోరీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పాయకరావుపేట పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కూపీ లాగి వాహనాల తనిఖీలు ప్రారంభించారు. అరట్ల కోట రోడ్డులో బుల్లెట్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని.. ఆపి వెరిఫై చేస్తారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో.. అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకడు విశాఖ జిల్లా చిన్నగాంట్యా డ లోని శ్రామిక నగర్ కు చెందిన రాజేష్ బాబు, కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన నాగరాజు. వీరిద్దరే బైక్ ల చోరీ కేసులో నిందితులుగా ఉన్నారు. 9 బుల్లెట్లు సహా 24 బైక్లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు ఇద్దరు.

రాజేష్ బాబు, నాగరాజు ఫ్రెండ్షిప్ కూడా వెరైటీ నే. చిన్న చిన్న నేరాలు చేసి వేర్వేరు కేసుల్లో జైలుకు వెళ్లిన ఈ ఇద్దరూ.. అక్కడ పశ్చాత్తాప పడలేదు. నేరాల్లో మరింత మెలకువలు నేర్చుకున్నారు. తోటి ఖైదీల సాయంతో.. చోరీ ల్లో నైపుణ్యం సంపాదించారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ దోస్తీ కట్టారు. ఇక చెప్పేదేముంది కనిపించిన బైక్ ను మూడో కంటికి తెలియకుండా మాయ చేసేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పిన్నీసే వారి అస్త్రం..! 10 నిమిషాల్లో బైక్ మాయం..! రాజేష్ బాబు, నాగరాజు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాళ్లను విచారించే సరికి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హ్యాండిల్ లాక్ ను బలంగా తిప్పి తాళం తొలగిస్తారు. కేవలం ఒక పిన్నీస్ సహాయంతో.. ఇంజన్ కు వెళ్లే రెండు వైర్లను కలిపి.. ఈజీగా స్టార్ట్ చేసేస్తారు. బైక్ పై ఎక్కి దర్జాగా అక్కడ నుంచి చెక్కెస్తారు. కంటికి కనిపించిన పది నిమిషాల వ్యవధిలోనే.. ఆ బైక్ ను అక్కడ నుంచి మాయ చేసేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయినా… మోడీ చేసిన తీరుపై పోలీసులు కాస్త అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వైద్యులను ఏ విధంగా చోరీ చేస్తారో పోలీసుల సమక్షంలోనే చేసి చూపించారు ఈ ఇద్దరు నిందితులు. కేవలం పాయకరావుపేట లోనే కాదు.. రాజమండ్రి, ఆలమూరు, దువ్వాడ ప్రాంతాల్లోనూ బైక్ లను చోరీ చేసినట్లు ఏఎస్పీ మణికంఠ వివరించారు. కేవలం టూవీలర్ లకు ఉండే లాక్ లే కాదు.. పార్క్ చేసినప్పుడు మీ బైక్ లకు అదనంగా చైన్ ల సహాయంతో తాళాలు వేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు పోలీసులు.

ఖాజా, వైజాగ్