Viral News: ఓరి దేవుడో.. బొమ్మతో ప్రేమలోపడ్డ యువతి.. ఆపై పెళ్లి చేసుకుని బిడ్డను కనింది..!

పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితం చాలా గొప్పగా ఉందని ఆమె చెప్పింది. అందరి భర్తల్లా ఈ బొమ్మ వాదించదు, కొట్టుకోవడం ఉండదు, ఎప్పుడూ తనని అర్థం చేసుకుంటుందని, తాను ఎప్పుడూ కోరుకున్న చక్కని జీవిత భాగస్వామి మార్సెలో మోరెస్సేనని ఆమె వివరించింది.

Viral News: ఓరి దేవుడో.. బొమ్మతో ప్రేమలోపడ్డ యువతి.. ఆపై పెళ్లి చేసుకుని బిడ్డను కనింది..!
Men Doll
Jyothi Gadda

|

Jun 25, 2022 | 5:21 PM

ప్రేమ గుడ్డిది..అని చాలా సందర్భాల్లో వింటుంటాం.. ఇక్కడ ఓ మహిళ ఆ మాటకు సరికొత్త అర్థాన్ని చెప్పింది. ఆ లేడీ ఇంట్లో తయారు చేసిన రాగ్‌డాల్‌తో ప్రేమలో పడింది. దానిని పెళ్లి చేసుకుంది. ఏకంగా ఇప్పుడు దానితో ఒక బిడ్డను కన్నానని చెబుతోంది. ఈ వింత సంఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంచలనం రేపుతోంది. స్థానికంగా కూడా తీవ్ర గందరగోళం సృష్టించింది. మనిషి, బొమ్మ మధ్య ప్రేమ కలిగితే..ఇంకేమైనా ఉందా..? వామ్మో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు..కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది..ఆ విచిత్ర వింత సంఘటన బ్రెజిల్‌లో వెలుగు చూసింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

బ్రెజిల్‌కు చెందిన 37 ఏళ్ల మారివాన్ రోకా మోర్స్ అనే మహిళ తన తల్లి ఇంట్లో తయారు చేసిన రాగ్ బొమ్మతో ఆమె ప్రేమలో పడింది. ఆ తర్వాత ఏకంగా ఆమె ఆ బొమ్మనే వివాహం చేసుకుంది. తాజాగా, ఈ జంటకు ఒక పాప, అది కూడా ఓ బొమ్మ బిడ్డపుట్టాడని చెబుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో షేర్‌ చేయటంతో వార్తపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

37 ఏళ్ల మారివాన్ రోకా మోర్స్ అనే మహిళకు ఆమె తల్లి కొన్నాళ్ల క్రితం మార్సెలో అనే బొమ్మను పరిచయం చేసింది. మోరేస్‌తో కలిసి డ్యాన్స్ చేయడానికి భాగస్వామి లేదని తెలుసుకున్న తర్వాత ఆమె తల్లి దానిని తయారుచేసింది. మోరేస్ కూడా తరచుగా తనకు డ్యాన్స్ పార్టనర్ లేడని ఇంట్లో బాధపడుతూ ఉండేది. “నాకు ఫర్రో డాన్సర్ లేకపోవడం వల్లనే ఈ బొమ్మ నా జీవితంలోకి వచ్చింది. నేను ఈ డ్యాన్స్ చేయడానికని ఫంక్షన్లకు వెళ్తాను కానీ ఎప్పుడూ నా డ్యాన్స్‌ భాగస్వామి దొరకలేదు “అని మోరేస్ తెలిపింది. ఆ బొమ్మ తన జీవితంలోకి రాగానే తనకు అనుకున్నవి జరిగాయాని, దాంతో చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే వాళ్లిద్దరూ ఇటీవల పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన వైవాహిక జీవితం చాలా గొప్పగా ఉందని ఆమె చెప్పింది. అందరి భర్తల్లా ఈ బొమ్మ వాదించదు, కొట్టుకోవడం ఉండదు, ఎప్పుడూ తనని అర్థం చేసుకుంటుందని, తాను ఎప్పుడూ కోరుకున్న చక్కని జీవిత భాగస్వామి మార్సెలో మోరెస్సేనని ఆమె వివరించింది.

ఇవి కూడా చదవండి

Men Doll M

“మార్సెలో తనకు ఓ గొప్ప, నమ్మకమైన భర్త అంటూ చెబుతోంది మోర్స్‌.. ఆడవాళ్ళందరూ అసూయపడేలాంటి వ్యక్తి అతడు…అంటూ మురిసిపోతోంది.పెళ్లి అనంతరం ఆ జంట హనీమూన్‌ వెళ్లారట. అప్పుడు తామిద్దరమూ ఆ రోజును చాలా ఆనందించాము” అని చెప్పింది మోర్స్‌. ఇప్పుడు తాజాగా, ఈ జంట తమ కుటుంబంలోకి ఒక బిడ్డ బొమ్మను కూడా ఆహ్వానించారు…ఇది విన్నవారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఈమేకు ఇదేం పిచ్చిరా బాబు అంటూ భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu