Konam Fish: వేట విరామం తర్వాత వల వేసిన మత్స్యకారులు… బయటకు లాగగా కోటి విలువచేసే..!

ఒక్కో చేప అయిదు కిలోలకు పైగా ఉంది. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మరో రెండు బోట్లలో మత్సకారులు వెళ్లి మూడు బోట్లలో తీసుకు వచ్చారు. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చి బహిరంగ వేలం నిర్వహించగా వ్యాపారులు కొనుగోలు చేసెందుకు పోటీపడ్డారు.

Konam Fish: వేట విరామం తర్వాత వల వేసిన మత్స్యకారులు... బయటకు లాగగా కోటి విలువచేసే..!
Konam Fish
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 25, 2022 | 3:28 PM

వేట విరామం తర్వాత తొలిసారిగా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో పండుగ వాతావరణం నెలకొంది. అమీనాబాద్ మినీ ఫిషింగ్ అర్బర్ లో టన్నులు కోలది కోనేం చేపలు వలకు చిక్కాయి. ఉప్పాడ కు చెందిన వంకా సత్తిబాబు, ఉమ్మిడి అప్పారావు( చేరువమ్మా ) లకు చెందిన బొటులో ఊహించని విధంగా కోనేం చేపలు పడటంతో చేపలరేవులో సందడి వాతావరణం నెలకొంది. ఒకే వలకు రూ. కోటికి పైగా విలువైన కోనేం జాతికి (Konam Fish)చెందిన చేపలు లభ్యమయ్యాయి. పది రోజుల క్రితం సముద్రంలోకి వేటకెళ్లిన మత్స్యకారులకు గిరాకీ ఉన్న మత్స్యజాతుల్లో ఈ జాతి చేపలు చిక్కాయి.

ఒక్కో చేప అయిదు కిలోలకు పైగా ఉంది. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మరో రెండు బోట్లలో మత్సకారులు వెళ్లి మూడు బోట్లలో తీసుకు వచ్చారు. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చి బహిరంగ వేలం నిర్వహించగా వ్యాపారులు కొనుగోలు చేసెందుకు పోటీపడ్డారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారులు వీటిని కోటి ముప్పై లక్షలకు పాడుకున్నారు. ఈ చేపలు సుమారుగా 13 టన్నుల బరువును కలిగి ఉన్నాయని కొనుగోలు దారులు తెలిపారు.

వేట విరామం తరువాత తినే కోనేం చేపలు ఇంత భారీ స్థాయిలో పడటంతో అధిక ధర పలికింది. ఒక్కో చేప ఖరీదు 2వేల వరకు ఉంటుంది. నేమలికోనెం చేపలు కూడా అరుదుగా పడతాయి. అవి కూడా ఖరీదు ఎక్కువే.. మూతు సూదిగా ఉండి మరింత పెద్దవిగా ఉంటాయి. ప్రస్తుతం పడ్డ కోనేం చేపలు చిన్నవి.. అన్ని ఒకే సైజులో పడటం విశేషంగా చేబుతున్నారు మత్స్యకారులు. దీనితో వేటకెళ్లిన మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి