AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇంతకు మించిన జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉంటుందా..? వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే..

ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా, మన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు మాత్రమే మనం వంద శాతం సురక్షితంగా ఉన్నామని భావిస్తాం..ఇప్పుడు ఎంత Z + సెక్యూరిటీ ఉన్నా, మన అమ్మనాన్నలతో మనకు లభించే భద్రత మరెక్కడా ఉండదు.. సెక్యూరిటీ అలర్ట్ వీడియో ఇది..

Viral Video: ఇంతకు మించిన జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉంటుందా..? వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే..
Elephant
Jyothi Gadda
|

Updated on: Jun 24, 2022 | 8:56 PM

Share

ఇంటర్నెట్ ప్రపంచమంటేనే విచిత్ర వీడియోలు, ఫోటోలతో నిండి ఉంటుంది. ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇంటర్నెట్‌లో ఎక్కువ శాతం జంతువుల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. జంతువుల ఫన్నీ వీడియోలను చూసేందుకు నెటిజన్లు చాలా ఇష్టపడుతుంటారు. కొన్ని జంతువులు సహజంగా చేసే ఫన్నీ ముచ్చట్లు ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటి వీడియోలు చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. మరికొన్ని వీడియోలు నెటిజన్ల మనసును హత్తుకుంటాయి. తాజాగా ఓ ఏనుగుల గుంపు అప్పుడే పుట్టిన బిడ్డను ఎలా కాపాడుకుంటుందో..చూపించే వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా, మన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు మాత్రమే మనం వంద శాతం సురక్షితంగా ఉన్నామని భావిస్తాం..ఇప్పుడు ఎంత Z + సెక్యూరిటీ ఉన్నా, మన అమ్మనాన్నలతో మనకు లభించే భద్రత మరెక్కడా ఉండదు.. సెక్యూరిటీ అలర్ట్ వీడియో ఇది..ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏనుగు పిల్ల ఏనుగుల గుంపు మధ్యలో వెళ్తోంది. అది ఏ మాత్రం బయటకు కనిపించకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాయి ఆ ఏనుగులు. రోడ్డుపై బుల్లి ఏనుగు ఎక్కడా తప్పిపోకుండా, మరే ఇతర జంతువుల బారిన పడకుండా వాటి తల్లిదండ్రులు, ఏనుగుల సమూహం ఆ బుజ్జి ఏనుగు కాపాడుకుంటున్న వైనం చూస్తుంటే నిజంగా వర్ణనాతీతం..మందలో ఏనుగుల పాదలకింద పడకుండా జాగ్రత్తగా వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కోయంబత్తూరులోని సత్యమంగళం అడవుల్లో కనిపించిన అరుదైన దృశ్యం. ఐదు ఏనుగుల గుంపు ఒకేచోట చాలా దగ్గరగా నడుచుకుంటూ వెళుతుండగా, దాని మధ్యలో చిన్నారి ఏనుగుపిల్ల ముందుకు వస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోకి నెటిజన్ల నుండి విశేష స్పందన లభిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి