Joe Biden : మ‌రోసారి త‌డ‌బ‌డిన జో బైడెన్.. అమెరికన్లకు టంగ్ ట్విస్టర్

మ‌రోసారి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారారు జోబైడెన్‌. 79 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన జోసెఫ్ బైడెన్(Joe Biden) అమెరికాను ఒకే ప‌దంలో నిర్వ‌హించేందుకు ప్ర‌యత్నం చేశారు.

Joe Biden : మ‌రోసారి త‌డ‌బ‌డిన జో బైడెన్..  అమెరికన్లకు టంగ్ ట్విస్టర్
Biden
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2022 | 9:23 PM

Joe Biden : వ‌య‌స్సు పెర‌గ‌డమో లేదంటే, ప‌రిపాల‌నా ప‌ర‌మైన ఒత్తిడి ఎక్కువగా ఉందో తెలియదుగానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ తరచూ ఏదోవిధంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతుంటారు..ఇటీవలి స్లిప్-అప్‌లో, బిడెన్ అమెరికాను ఒకే పదంలో వివరించడానికి ప్రయత్నించాడు. జోసెఫ్ బైడెన్(Joe Biden) మ‌రోసారి త‌డ‌బ‌డ్డారు. ఆయ‌న ఇలా త‌డ‌బ‌డ‌డం ఇది మొదటిసారి కాదు గ‌తంలో కూడా నోరు జారారు. త‌ప్పుగా ఉచ్చ‌రించారు. ఆ త‌ర్వాత వైట్ హౌస్ స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా బైడెన్‌ అమెరికన్లకు టంగ్ ట్విస్టర్ ఇచ్చాడు. అమెరికాను నిర్వ‌హించ‌డంలో, దానిని ప‌ల‌క‌డంలో త‌డ‌బాటుకు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న మాట్లాడిన మాట‌ల‌తో కూడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మ‌రోసారి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారారు జోబైడెన్‌. 79 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన జోసెఫ్ బైడెన్(Joe Biden) అమెరికాను ఒకే ప‌దంలో నిర్వ‌హించేందుకు ప్ర‌యత్నం చేశారు. అమెరికా అన్న‌ది ఒకే ప‌దంలో నిర్వ‌చించ‌గ‌ల దేశం అని చెప్పారు. ఇదే స‌మ‌యంలో -ఎ- తో ప్రారంభ‌మ‌య్యే ప‌దాన్ని ఉచ్చ‌రించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. అయితే, బైడెన్ తడబాటు ఇదేం మొద‌టిసారి కాదు గ‌తంలో స‌మాన వేత‌న దినోత్స‌వం సంద‌ర్భంగా వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స‌మావేశంలో జోసెఫ్ బైడెన్ ప్ర‌సంగించారు.

ఇవి కూడా చదవండి

ఇదే స‌మ‌యంలో అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న ప్ర‌వాస భార‌తీయురాలు క‌మలా హారిస్ ను ఫ‌స్ట్ లేడీ అంటూ పిలిచాడు. క‌మ‌లా హారిస్ త‌న భ‌ర్త‌కు అనారోగ్యం ఉండ‌డం వ‌ల్ల ఆమె రాలేక పోయింది. ఆమెను ఉద‌హ‌రిస్తూ ఎందుకు రాలేద‌న్న కార‌ణాన్ని వివ‌రిస్తూ బైడెన్ పై విధంగా కామెంట్ చేయ‌డం క‌ల‌క‌లం రేగింది. అప్ప‌ట్లో ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం బైడెన్ వీడియో వైర‌ల్ అవుతోంది. కిమ్ డాట్‌కామ్ అనే వినియోగదారు ట్విట్టర్‌లో క్లిప్‌ను షేర్‌ చేశారు. దీనిలో మిస్టర్ బిడెన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి