AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Rath Yatra: జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఈ ఆసక్తికరమైన విషయాలు

ఈ సంవత్సరం ఈ జగన్నాథుడి రథ యాత్ర జూలై 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి లక్షల మంది పూరికి చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి జగన్నాథుడి భక్తులు ఈ రథయాత్రలో భాగస్వాములు అవుతారు.

Puri Rath Yatra: జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఈ ఆసక్తికరమైన విషయాలు
Puri Rath Yatra
Surya Kala
|

Updated on: Jun 25, 2022 | 3:44 PM

Share

Puri Rath Yatra: సనాతనహిందూ మతంలో చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra) ప్రత్యేక ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఈ ధామ్‌లలో ఒకటి జగన్నాథ దేవాలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీకృష్ణుడు తన అన్నా చెల్లెలుతో కలిసి పూజలను అందుకుంటున్నాడు. ఇక పూరి జగన్నాథ రథయాత్ర అని పిలువబడే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి.. ఈ ధామ్ నుండి ప్రతి సంవత్సరం రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ యాత్ర జూలై 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి లక్షల మంది పూరికి చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి జగన్నాథుడి భక్తులు ఈ రథయాత్రలో భాగస్వాములు అవుతారు. జగన్నాథుడి రథయాత్ర (జగన్నాథ రథయాత్ర) లో పాల్గొంటే.. సకల  తీర్థయాత్రల పుణ్యఫలాలను పొందుతారని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా జగన్నాథ రథయాత్ర మహాపర్వాన్ని ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండో తేదీన నిర్వహించనున్నారు.

మీరు కూడా జగన్నాథుడి రథయాత్రలో భాగం కావాలని ప్లాన్ చేస్తున్నారా అయితే.. ఈ యాత్రకు సంబంధించిన ప్రత్యేక విషయాలను ఒకసారి తెలుసుకోండి. ఈ ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

మూడు రథాలు సిద్ధం: ఈ రథయాత్ర కోసం.. మూడు పవిత్ర రథాలు సిద్ధం చేయబడ్డాయి.  వాటిలో ఒకటి శ్రీకృష్ణుడికి..  రెండు అతని సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రల కోసం రెడీ చేయబడింది. ఈ రథాల రంగులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఈ వాస్తవం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. శ్రీ కృష్ణుడి రథాన్ని గరుడధ్వజ అని పిలుస్తారు. ఈ రథం రంగు ఎల్లప్పుడూ పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటుంది. మరోవైపు, బలరాముడి రథాన్ని తలధ్వజ అని పిలుస్తారు. ఈ రథం రంగు ఎరుపు,ఆకుపచ్చలో ఉంటుంది. మరోవైపు, సుభద్ర రథం రంగు నలుపు లేదా నీలం రంగులో ఏర్పాటు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మేనఅత్త ఇంటికి వెళ్లే జగన్నాథుడు: జగన్నాథుడు రథయాత్ర ద్వారా తన మేనత్త ఆలయాన్ని సందర్శిస్తాడని పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం. రథయాత్ర గుండిచా ఆలయానికి తీసుకువెళతారు. ఇక్కడకు ముక్కోటి దేవతలు వచ్చి విశ్రాంతి తీసుకుంటారని చెబుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులు శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. జగన్నాథుని రథయాత్ర ఆషాఢ మాసం రెండవ రోజున ప్రారంభమవుతుంది. శుక్ల పక్షంలోని 11వ రోజున ఆయన తన ఇంటికి తిరిగి వస్తాడు.

రథంలో విగ్రహాలు ప్రతిష్ఠాపన: జగన్నాథుడికి రథయాత్ర గజపతి రాజు చేతులమీదుగా ప్రారంభమవుతుంది. ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆచార సాంప్రదాయం. భగవంతుడు వెళ్లేంత దారిలో బంగారు చీపురుతో రోడ్డుని శుభ్రపరుస్తారు. ఇక యాత్ర ముగిసిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు రథాల్లోనే దేవతా విగ్రహాలు ఉంటాయి.  శ్రీకృష్ణుడు, బలరాముడు ,సుభద్ర దేవి కోసం ఆలయ ద్వారాలు ఏకాదశి నాడు తెరవబడతాయి. అనంతరం ఆ విగ్రహాలను ఆలయంలోకి తీసుకొచ్చి తర్వాత స్నానం చేసి పద్ధతి ప్రకారం పూజలను నిర్వహిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)