Astro Remedies: నేటికీ మనదేశంలో పాలు, ఉప్పు వంటి పదార్ధాల్లో కొన్ని మూఢనమ్మకాలను పాటిస్తూనే ఉన్నారు.. అవి ఏమిటంటే..

భారతదేశంలో.. నేటికీ కొన్ని మూఢనమ్మకాలకు సంబంధించిన చర్యలను అనుసరిస్తూనే ఉన్నారు. వీటిని ప్రజలు నమ్మడమే కాదు పాటిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహారం, పానీయాలకు సంబంధించిన కొన్ని మూఢనమ్మకాలను నేటికీ పాటిస్తున్నారు. ఏవి ఏమిటో తెలుసుకుందాం..

Astro Remedies: నేటికీ మనదేశంలో పాలు, ఉప్పు వంటి పదార్ధాల్లో కొన్ని మూఢనమ్మకాలను పాటిస్తూనే ఉన్నారు.. అవి ఏమిటంటే..
Indian Fallow These Rules
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2022 | 4:11 PM

Astro Remedies: భారతదేశం కర్మ భూమి.. ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలు రకరకాలుగా ఉంటాయి. ఆధునిక యుగంలో నేటికీ కొన్ని నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది ఈ నమ్మకాలను బలంగా నమ్మితే.. మరికొందరు.. వీటిని మూఢనమ్మకాలు అని అంటూ కొట్టిపడేస్తారు. అయితే కొన్ని మూఢనమ్మకాలు.. ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు.. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రబలంగా నమ్ముతారు.. ముఖ్యంగా.. నిమ్మకాయ, ఉప్పు, పెరుగు, వంటి పదార్ధాల విషయంలో చాలావరకూ కొన్ని నమ్మకాలను అనుసరిస్తారు. ఒకప్పుడు ఈ మూఢనమ్మకాలు చాలా ఆధిపత్యం వహించెవి.. కానీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ప్రజలు మూఢనమ్మకాలను అనుసరించడం తగ్గింది. మూఢనమ్మకం అంటే సరైన కారణం లేదా ఫలితం లేని నమ్మకం అని అంటారు.

అయితే ఇప్పటికీ భారతదేశంలో చాలా ప్రాంతంలో కొన్ని నమ్మకాలను ఆచరిస్తున్నారు. వీటిని తమ జీవితంలో  భాగస్వామ్యంగా చేసుకుని అవలంబిస్తున్నారు. ఈరోజు ఆహారం, పానీయాలకు సంబంధించిన కొన్ని మూఢనమ్మకాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము. వాటి గురించి తెలుసుకోండి..

పాలు పొంగడం.. పాలు చిందడం:  వంటగదిలో పని చేస్తున్నప్పుడు ఆహార పదార్థాలు పడిపోవడం సర్వసాధారణం.. అయితే కొన్ని పదార్ధాల విషయంలో ప్రజలు మత విశ్వాసాలను కూడా జోడించారు. పాలు వేడిచేస్తున్నప్పుడు అవి గిన్నె లో నుంచి పొంగి బయటకు పొర్లితే..  లేదా పాలు చేజారి.. వంటగదిలో ఎక్కడైనా పడిపోయినా అది ఒక రకమైన చెడుకు సంకేతముగా భావిస్తారు. పాలు చేజారితే.. ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య వివాదం.. పేదరికం ఏర్పడవచ్చునని నమ్మకం.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి: చెడు దృష్టిని నివారించడానికి వెల్లుల్లిని ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా, ప్రజలు ఇప్పటికీ తమ ఇళ్లలో వెల్లుల్లికి సంబంధించిన అనేక నివారణలను అనుసరిస్తారు.

ఉప్పు కింద పడడం: భారతదేశంలో ఉప్పుకు సంబంధించిన అనేక ఉపాయాలు నేటికీ అవలంబిస్తున్నారు. ఉప్పు చేజారడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. వంటగదిలో ఉప్పు పడితే .. అది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

చెడు కలలను నివారించే ఉల్లిపాయలు.. ఉల్లిపాయల నివారణ చెడు కలల సమస్య నుండి మనకు ఉపశమనం కలిగిస్తుందని కూడా నమ్ముతారు. ఈ కారణంగా, ప్రజలు నిద్రపోయేటప్పుడు వారి దిండు కింద లేదా తల కింద ఉల్లిపాయలను ఉంచుతారు.

సూర్యాస్తమయం తర్వాత పాలు కొనకండి సూర్యాస్తమయం తర్వాత పాలు తీసుకోవడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే పశువుల ద్వారా ఉత్పత్తి అయ్యే పాలను తగ్గిస్తుందని పశు యజమానులు నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)