Astro Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే.. ఇంట్లో దారిద్య్రాన్ని ఆర్ధిక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట..

సూర్యాస్తమయం తర్వాత పనులు చేయడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి.. ఈ పనులను పొరపాటున కూడా చేయకూడదు. అవి ఏమిటో తెలుసుకుందాం..

Astro Tips: సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే.. ఇంట్లో దారిద్య్రాన్ని ఆర్ధిక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందట..
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2022 | 8:56 PM

Astro Tips: జ్యోతిష్య శాస్త్రంలో చిట్కాలు ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత దూరంగా పాటించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయడం చాలా అశుభంగా పరిగణిస్తారు. పురాణ గ్రంథాల్లో ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం అశుభంగా పేర్కొన్నయి. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనుల గురించి మన పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు.  సాయంత్రం పూట నిద్రపోకూడదు, తుడుచుకోకూడదు అని పిల్లలకు చెబుతుంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అనేక సమస్యలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  లక్ష్మీదేవి, సరస్వతి దేవి, దుర్గాదేవి ఈ సమయంలో ఇంటికి వస్తారు. అటువంటి పరిస్థితిలో, చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సూర్యాస్తమయం తర్వాత పనులు చేయడం వల్ల ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి.. ఈ పనులను పొరపాటున కూడా చేయకూడదు. అవి ఏమిటో తెలుసుకుందాం..

సాయంత్రం నిద్రపోవద్దు ప్రతి పనికి సరైన సమయం ఉందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో మంచి అలవాట్లను కలిగి ఉండటం చాలా ముఖ్యం. తద్వారా అన్ని పనులు సరైన సమయంలో పూర్తి చేస్తారు. చాలా మంది సాయంత్రం సమయంలో నిద్రపోతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ సమయంలో నిద్రపోవడం నిషిద్ధంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల ఆయుస్సు  తగ్గడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా సాయంత్రం పూట ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి.

సూర్యాస్తమయం తర్వాత ఇల్లు లేదా ప్రాంగణాన్ని తుడుచుకోవద్దు శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం, సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చకూడదు. ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఈ సమయంలో ఊడ్చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది. దీనివల్ల ధననష్టం, ఇంట్లో డబ్బు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి

గుమ్మం మీద కూర్చోకూడదు సాయంత్రం పూట ఇంటి గుమ్మంలో కూర్చోకూడదు. అలా చేయడం అశుభం అని భావిస్తారు. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు.

తులసిని తాకవద్దు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం అశుభం. ఈ సమయంలో తులసి మొక్కకు నీరు కూడా పోయకూడదు. దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం