Horoscope Today: ఈ రోజు వీరికి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి.. గురువారం రాశి ఫలాలు..
ఈరోజు వీరు బంధుమిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తలు వహించడం మంచిది.. అనవసర ఖర్చులు పెరుగుతాయి...
మేషరాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు.. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.
వృషభ రాశి.. ఈరోజు వీరు కొత్త పనులను ప్రారంభిస్తారు.. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. బంధుమిత్రులను కలుసుకుంటారు.. విందులు, వినోదాల్లో పాల్గోంటారు.. అంతేకాకుండా శుభవార్తలు వింటారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి..
మిథున రాశి.. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఉండేవారికి అభివృద్ధి ఉంటుంది.. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు.. అనవసర ఖర్చులు పెరుగుతాయి…మానసిక ఆందోళన పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు..స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది..
కర్కాటక రాశి.. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి.. మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు… విదేశయాన ప్రయత్నాలు చేస్తారు..
సింహ రాశి.. వీరు చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి.. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. సంఘంలో కీర్తి, ప్రతిష్టల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్య రాశి.. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు.. ఇతరులను ఆదర్శంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.. స్త్రీలు, బంధుమిత్రులను కలుసుకుంటారు. మానసిక సంతోషం ఉంటుంది..
తుల రాశి.. ఈరోజు వీరు నూతన కార్యాలను ఆలస్యంగా ప్రారంభిస్తారు.. అల్ప భోజనం వలన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది.. అనవసర భయాందోళనలకు లోనవుతారు.. ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరు సూక్ష్మ బుద్దితో విజయం సాధిస్తారు.. శతృబాధలు తొలగిపోతాయి.. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తారు.. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు.. ఆకస్మిక లాభాలు ఉంటాయి..
ధనుస్సు రాశి.. ఈరోజు వీరు బంధుమిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తలు వహించడం మంచిది.. అనవసర ఖర్చులు పెరుగుతాయి… ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది.. చిన్న చిన్న విషయాల కోసం ఎక్కువగా శ్రమిస్తారు..
మకర రాశి.. ఈరోజు ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. అనవసర ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
కుంభ రాశి.. వీరు విందులు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది.. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళనతో ఉంటారు.. కుటుంబంలో మార్పును కోరుకుంటారు.. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి..
మీన రాశి.. ఈరోజు వీరు ఇతరులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.. ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి… అనవసర ప్రయాణాలు చేస్తారు.. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు.. ఈరోజు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)