Horoscope Today: వీరికి శ్రమాధిక్యం.. అనవసర ఖర్చులు పెరుగుతాయి.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (24-06-2022): ఏపనైనా చేయాలన్నా, మొదలుపెట్టాలన్నా మంచి ముహూర్తం చూసుకుంటారు చాలామంది . ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏరంగంలోని వారైనా ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఆ రోజు ఎలా ఉందోనని ఆలోచిస్తారు..
Horoscope Today (24-06-2022): ఏపనైనా చేయాలన్నా, మొదలుపెట్టాలన్నా మంచి ముహూర్తం చూసుకుంటారు చాలామంది . ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏరంగంలోని వారైనా ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఆ రోజు ఎలా ఉందోనని ఆలోచిస్తారు. ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి.. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఈక్రమంలోనే ఒకసారి తమ దినఫలాల( Daily Horoscope) ఎలా ఉన్నాయోనని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 24వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
మేషం
ఈ రాశివారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి కుటుంబ సభ్యులు, బంధు,మిత్రులతో కలిసి చర్చిస్తారు. శివుడిని ఆరాధిస్తే మేలు కలుగుతుంది.
వృషభం
ఆయా రంగాల్లో శ్రమాధిక్యం పెరుగుతుంది. ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ, అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. శ్రీహరిని పూజిస్తే సానుకూల ఫలితాలు కలుగుతాయి.
మిథునం
ఆటంకాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. చంచల స్వభావంతో తోటివారితో ఇబ్బందులు తప్పవు. పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. చెడు బుద్ధి కలిగిన వారికి దూరంగా ఉండాలి. పరమేశ్వరుడిని దర్శించుకోవడం ఉత్తమం.
కర్కాటకం
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు, విఘ్నాలు ఎదురవకుండా చూసుకోవాలి. అభివృద్ధికి దోహదపడేలా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మేలు కలుగుతుంది.
సింహం
వీరికి మిశ్రమకాలం నడుస్తోంది. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనుల్లో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల శుభం చేకూరుతుంది.
కన్య
చేపట్టిన పనులు, కార్యక్రమాల్లో ఒకటీ రెండు ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. కుటుంబ సభ్యులు, బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శివుడిని పూజించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి.
తుల
పట్టుదలతో అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అయితే ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.కీలక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాటలు జాగ్రత్తగా ఉండాలి. హనుమంతుడిని ఆరాధించడం శుభప్రదం.
వృశ్చికం
వీరికి గ్రహబలం బాగుంది. ఆయా రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒక శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలంతో కీలక సమయాల్లో పెద్దలు లేదా అధికారుల మన్ననలు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం ఉత్తమం.
ధనస్సు
చేపట్టిన రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసం, మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకొనిపోవాలి. ఇష్టదైవారాధన వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
మకరం
ఈ రాశివారికి సమస్యలు తొలగిపోతాయి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే సానుకూల ఫలితాలు పొందుతారు.
కుంభం
వీరికి మంచి కాలం నడుస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధనధాన్యవృద్ధి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శివనామస్మరణ చేయడం మంచిది.
మీనం
ఆయా రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం ఉత్తమం. శ్రీనరసింహస్వామి ఆరాధిస్తే శుభప్రదం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..