Sumanth Ashwin: చార్మినార్‌ వద్ద సందడి చేసిన 7 డేస్‌ 6 నైట్స్‌ టీమ్‌ సందడి.. మహేశ్ ‘ఒక్కడు’ సినిమాను గుర్తుచేసుకుంటూ..

7Days 6 Nights: యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ (Sumanth Ashwin) చాలా రోజుల తర్వాత నటించిన చిత్రం 7 డేస్‌ 6 నైట్స్‌. గతంలో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు నిర్మించి ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఎం.ఎస్‌. రాజు ఈ సినిమాను తెరకెక్కించారు..

Sumanth Ashwin: చార్మినార్‌ వద్ద సందడి చేసిన 7 డేస్‌ 6 నైట్స్‌ టీమ్‌ సందడి.. మహేశ్ 'ఒక్కడు' సినిమాను గుర్తుచేసుకుంటూ..
7 Days 6 Nights Movie Team
Follow us
Basha Shek

|

Updated on: Jun 23, 2022 | 9:22 PM

7Days 6 Nights: యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ (Sumanth Ashwin) చాలా రోజుల తర్వాత నటించిన చిత్రం 7 డేస్‌ 6 నైట్స్‌. గతంలో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు నిర్మించి ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఎం.ఎస్‌. రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. మెహ‌ర్ చావల్, రోహ‌న్, కృతిక శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం (జూన్‌24)న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా చార్మినార్‌ వద్ద చిత్రబృందం సందడి చేసింది. హీరో సుమంత్‌, మెహర్‌ చావల్‌, కృతికశెట్టి తదితరులు అక్కడి చుట్టుపక్కల పరిసరాల్లో సందడి చేశారు. ఛాయ్ తాగుతూ.. ఐస్‌క్రీమ్ తింటూ లోకల్‌ఫుడ్స్‌ని ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది చిత్రబృందం. ‘రేపు మా సినిమా విడుద‌ల‌వుతుంది. అంద‌రూ థియేట‌ర్లలోనే మా సినిమాను చూసి..ఎంజాయ్ చేయండి’ అని చిత్రబృందం కోరింది.

ఈ సందర్భంగా సుమంత్‌ తన తండ్రి నిర్మాతగా వ్యవహరించిన ఒక్కడు సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్నారు. మహేశ్‌ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో చార్మినార్‌ సెట్‌ అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా 7 డేస్‌ 6 నైట్స్‌ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్స్ ప్రొడ‌క్షన్స్‌ స‌మ‌ర్పణలో వైల్డ్ హ‌నీ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్ పై వింటేజ్ పిక్చర్స్‌, ఏబీజీ క్రియేష‌న్స్ తో క‌లిసి సుమంత్ అశ్విన్, ఎస్ ర‌జినీకాంత్ నిర్మిస్తున్నారు. స‌మ‌ర్థ్ గొల్లపూడి ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌కు సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమాల కోసం క్లిక్ చేయండి..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్