67 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సులు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులకు భారీ ఓటమి మిగిల్చిన బ్యాటర్..
యూఏఈ మహిళల జట్టు ఖతార్ ముందు 215 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కానీ, ఖతార్ మహిళలు 20 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసి టీ20 మ్యాచ్‌లో 153 పరుగుల తేడాతో ఓడిపోయారు.
టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్లు భారీ లక్ష్యం ముందు తడబడి, ఓటమిపాలవడం ఎన్నో చూశాం. అయితే కేవలం ఒక్క ఆటగాడితో జట్టు మొత్తం గెలవలేకపోవడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చెప్పబోయే మ్యాచ్ మాత్రం ఇందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడ జట్టు భారీ స్కోరు చేసింది. కానీ, అందులో ఒక్క ఆటగాడు భారీగా పరుగులు చేయడంతో దానిని అధిగమించడం ప్రత్యర్థి జట్టుకు కష్టంగా మారింది. సగానికి పైగా జట్టు 10 పరుగులు కూడా చేయని పరిస్థితి నెలకొంది. దీంతో జట్టు పరిస్థితి మరీ దారుణంగా తయారవ్వడంతోపాటు, భారీగా ఓటమి పాలైంది. అంటే ఆ జట్టు153 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మనం మాట్లాడుకుంటున్న మ్యాచ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ మహిళల టీ20 ఛాంపియన్‌షిప్‌లో యూఏఈ, ఖతార్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో, యూఏఈ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రతిస్పందనగా 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఖతార్ జట్టు కేవలం 61 పరుగులకు ఆలౌటైంది.
67 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సులు..
యూఏఈ తరపున 23 ఏళ్ల ఓపెనర్ ఇషా ఓజా 67 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేసింది. టీ20 క్రికెట్‌లో ఇషా సాధించిన రెండో సెంచరీ ఇది. అంతకుముందు, ఆమె ఈ ఏడాది మార్చిలో తన మొదటి సెంచరీని సాధించింది. యూఏఈ తరపున ఆమె ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 174 పరుగులు జోడించింది. ఇషాతో పాటు రెండో ఓపెనర్ తిరత సతీష్ 55 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది.