AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

On This Day: టీమిండియాను దెబ్బ తీసిన కేన్ మామ.. కోట్లాది ఫ్యాన్స్‌కు నిరాశ మిగిల్చిన కోహ్లీసేన..

జూన్ 18 - 23 మధ్య సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగింది.

On This Day: టీమిండియాను దెబ్బ తీసిన కేన్ మామ.. కోట్లాది ఫ్యాన్స్‌కు నిరాశ మిగిల్చిన కోహ్లీసేన..
Indian Cricket
Ravi Kiran
|

Updated on: Jun 23, 2022 | 12:05 PM

Share

జూన్ 23.. టీమిండియా ఫ్యాన్స్‌‌కు గుర్తుండిపోయే రోజు. సరిగ్గా ఏడాది క్రితం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీసేన.. న్యూజిలాండ్ చేతుల్లో పరాజయం పాలైంది. దీనితో కివీస్ జట్టు తొలిసారిగా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలిచి రికార్డు సృష్టించింది. జూన్ 18 – 23 మధ్య సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియం వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగింది. అప్పుడు టీమిండియాకు విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తుండగా.. న్యూజిలాండ్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ బరిలోకి దిగాడు.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. తొలుత భారత్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఇక కివీస్ బౌలర్ జమీసన్(5 వికెట్లు) దెబ్బకు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ అయింది. అజింక్య రహానే 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అటు షమీ(4 వికెట్లు) పదునైన బంతులకు కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు వెనుకబడి ఉన్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. కివీస్ పేస్ త్రయం సౌథీ(4 వికెట్లు), బౌల్ట్(3 వికెట్లు), జమీసన్(2 వికెట్లు) యార్కర్లకు టీమిండియా 170 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇవి కూడా చదవండి

ఇంకేముంది న్యూజిలాండ్‌కు 139 పరుగుల టార్గెట్ నిర్దేశించబడింది. రెండు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని కివీస్ సునాయాసంగా చేధించింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 89 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో అజేయంగా 52 పరుగులు చేయగా.. రాస్ టేలర్ 100 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా, ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీతో దాదాపు 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీని న్యూజిలాండ్ గెలుచుకుంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!